ఇమ్రాన్ ఖాన్ సోదరి అరెస్ట్.. పాక్‌లో హైటెన్షన్!

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్‌ను లాహోర్లోని ఆమె నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ పార్టీ తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనకు ముందు ఈ అరెస్ట్ జరగడం గమనార్హం.

ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు వెనుక అసలు నిజం చెప్పిన కపిల్ దేవ్!
ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు వెనుక అసలు నిజం చెప్పిన కపిల్ దేవ్!

నిరసన ప్రదర్శన ముందస్తు అరెస్టులు
ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ విడుదలే ప్రధాన డిమాండ్‌గా పీటీఐ పిలుపునిచ్చిన సెప్టెంబర్ 27 నిరసన కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్న వేళ పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. అలీమా ఖాన్ అరెస్టుకు ముందే నిరసనలకు సిద్ధమవుతున్న నలుగురు పీటీఐ నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Imran Khan Sister Aleema Khan Arrested in Lahore Ahead of PTI Protests on September 27 Full Details

ఇస్లామాబాద్‌లో భద్రత పెంపు
పాకిస్తాన్‌లో నిరసనల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇస్లామాబాద్ పోలీసు యంత్రాంగం, రాజధాని పరిపాలనా అధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఇస్లామాబాద్‌లోని సెంట్రల్ పోలీస్ ఆఫీస్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రణాళికలను ఆమోదించారు. నిరసనకారుల కదలికలు, పీటీఐ నాయకులు, శ్రేణుల కార్యకలాపాలపై నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

జైలులో ఇమ్రాన్ ఖాన్.. రెండో పెళ్లి చేసుకున్న మాజీ భార్య!
జైలులో ఇమ్రాన్ ఖాన్.. రెండో పెళ్లి చేసుకున్న మాజీ భార్య!

ర్యాలీలు, వసతులపై నిఘా నేత్రం
శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా అతిథి గృహాలు, లాడ్జీలు, బస్ టెర్మినల్స్ వద్ద పోలీసులు తనిఖీలను పెంచారు. నిరసనకారులకు ఆహారం, నీరు, రవాణా, వసతి సౌకర్యాలు కల్పించే కాంట్రాక్టర్లు, నిర్వాహకులపై నిఘా ఉంచాలని సంబంధిత పోలీసు యూనిట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్, స్పెషల్ బ్రాంచ్ సహా ప్రధాన నిఘా విభాగాలను అధికారులు హై అలర్ట్‌లో ఉంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+