చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లనిపించింది!

మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందంటే అభిమానులకు అది పండగ వాతావరణమే. వారి అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాతలు కూడా కోట్లు ఖర్చు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ భారీ అంచనాలు తలకిందులై, బాక్సాఫీస్ వద్ద సినిమాలు బోల్తా కొడుతుంటాయి. అలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కడి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'మృగరాజు' ఒకటి. 'చూడాలని ఉంది' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరంజీవి, గుణశేఖర్, నిర్మాత దేవి వరప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితంపై నిర్మాత దేవి వరప్రసాద్ గతంలో స్పందిస్తూ.. "మృగరాజు రిలీజ్ రోజే తాను చనిపోయినట్లు అనిపించింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్, విమర్శలపై దర్శకుడు గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికర నిజాలను బయటపెట్టారు.

i-felt-like-i-had-died-on-the-very-day-chiranjeevis-movie-was-released-reveals-director-gunasekhar

అది అసలు నా కథ కాదు!
అంత పెద్ద సినిమా ఫెయిల్ అయినప్పుడు ఏ నిర్మాతకైనా బాధ కలుగుతుంది. కానీ, ఆ సినిమా ఫెయిల్యూర్ విషయంలో నా తప్పు లేదు. అసలు ఆ సినిమాని చెడగొట్టింది నేను కాదు. 'మృగరాజు' అనేది నా సొంత కథ కాదు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఒక కథలోకి నన్ను దర్శకుడిగా తీసుకువచ్చారు" అని గుణశేఖర్ స్పష్టం చేశారు. సాధారణంగా సమ్మర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను, ఇంకా చాలా గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉండగానే హడావుడిగా సంక్రాంతికి రిలీజ్ చేశారని ఆయన తెలిపారు. అంత తొందరగా, హడావుడిగా విడుదల చేస్తే క్వాలిటీ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.

నా ప్రమేయం లేకుండానే ఆ తప్పులు జరిగాయి
సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడేసరికి తాను వేరే పనుల్లో బిజీగా ఉండాల్సి వచ్చిందని, అన్ని పనులను ఒకే వ్యక్తి దగ్గరుండి చూసుకోవడం సాధ్యం కాదని గుణశేఖర్ పేర్కొన్నారు. "నిర్మాత దేవి వరప్రసాద్ గారే స్వయంగా తన ఆధ్వర్యంలో భారీ సెట్ వేసి చివరి సాంగ్ షూట్ చేశారు. ఆ పాట కోసం హైడ్రాలిక్ మెషీన్స్ తెప్పించి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారు. ఇలాంటి తప్పులన్నీ నా ప్రమేయం లేకుండానే జరిగాయి" అని ఆయన వెల్లడించారు. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, చిరంజీవితోనూ, నిర్మాత దేవి వరప్రసాద్‌తోనూ తనకు ఇప్పటికీ ఎంతో మంచి అనుబంధం ఉందని గుణశేఖర్ తేల్చిచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+