జనసేన 175 స్థానాల్లో పోటీచేస్తుంది.... ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Recommended Video

పవన్ కళ్యాణ్ తమతో కలిసి పోటీ చేస్తే తప్పేముందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. తాము వామపక్షాలతో తప్ప మరెవరితో కలిసి 2019 సాధారణ ఎన్నికల్లో పోటీచేయమని స్పష్టం చేశారు. జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తుందని చెప్పారు. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం కల్పిస్తామని జనసేనాని స్పష్టం చేశారు. అధికార పక్షం ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దంటూ వాటిని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.
ఏపీలో 2019 సాధారణ ఎన్నికలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. త్రిముఖ పోటీ ఏపీలో నెలకొనడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ ... ఆ తర్వాత కొన్ని మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్‌బై చెప్పేశాడు. ప్రస్తుతం ఆయన తన పార్టీ నిర్మాణ కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీచేస్తే తప్పేంటి అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు బీజేపీయేతర పార్టీలతో పవన్ జట్టు కట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం మరింత డోలాయమానంకు గురించేసింది. ఎంతలా అంటే పవన్ తిరిగి చంద్రబాబుకు మద్దతు పలుకుతారా అనే చర్చ కూడా మొదలైంది.
జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలిసి వెళ్ళము. యువతకు , మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి - @PawanKalyan #JSPToContestIn175Constituencies
— JanaSena Party (@JanaSenaParty) January 3, 2019

అయితే ఇలాంటి చర్చలకు, రూమర్లకు ఫుల్‌స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా తన స్టాండ్ స్పష్టం చేశారు. 2019లో జనం బలంతోనే జనసేన 175 స్థానాలలో పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఒక్క వామపక్షాలతో తప్ప మరెవరితోను జనసేన కలిసి పోటీచేయదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పవన్ ట్వీట్‌తో ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారనుంది. ఇక అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వ్యూహాలు ప్రతివ్యూహాలు, సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications