''గాడిద పని గాడిద చేయాలి'' పవన్ కల్యాణ్‌పై వీరమహిళ ఫైర్
పీఠాపురం.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ..వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఇటీవలే విసృతంగా పర్యటించారు. ఇక ఎన్నికల ముందు జనసేనలో అసమ్మతి బాగా ఎక్కువగా కనిపిస్తోంది.

జనసేన నుంచి నేతలు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఓ మహిళా కార్యకర్త పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Save #Pithapuram from #PawanKalyan
— Jaya Kalyani Akula (@JayaKalyani_AJ) April 2, 2024
"Joke of the decade @PawanKalyan "
తన పార్టీని నడపలేక వేరొక పార్టీకి రెంట్ కి ఇచ్చి, తన గెలుపు వేరొక పార్టీ వాళ్ళ చేతిలో పెట్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమి చేసేద్దామని బయలుదేరారో ఈ సారు??
వచ్చే ఎన్నికలకు బూత్ స్థాయి కమిటీలు లేని పార్టీ… https://t.co/YF1rYMmXXH
"సేవ్ పిఠాపురం ఫ్రం పవన్ కల్యాణ్" అని మొదలు పెట్టిన ఈ ట్వీట్‌లో ''తన పార్టీని నడపలేక వేరొక పార్టీకి రెంట్ కి ఇచ్చి, తన గెలుపు వేరొక పార్టీ వాళ్ళ చేతిలో పెట్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమి చేసేద్దామని బయలుదేరారో ఈ సారు?? వచ్చే ఎన్నికలకు బూత్ స్థాయి కమిటీలు లేని పార్టీ వాళ్ళు ప్రతీ గ్రామంలో పెన్షన్ అందేలా చేస్తాము అని అనడం ఏదైతే ఉందో .. నభూతో నభవిష్యతి! గాడిద పని గాడిద చేయాలి.. గుర్రం పని గుర్రమే చేయాలి అనే సామెత గుర్తొస్తుంది..సేవ్ పిఠాపురం ఫ్రం పవన్ కల్యాణ్ అనడంతోపాటు.. దశాబ్దంలో అతిపెద్ద జోక్ పవన్ కల్యాణ్ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. పవన్ నుంచి పిఠాపురాన్ని రక్షించుకోవాలంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications