స్థానిక ఎన్నికల్లో సీట్లు, అభ్యర్ధుల పై తేల్చేసిన జనసేన - ఇదీ అసలు లెక్క..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కూటమి పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా భావిస్తున్నాయి. అటు వైసీపీ సైతం ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటోంది. మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు ఎన్నికల పైన కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇక.. కూటమిలో సీట్ల షేరింగ్ పైనా చర్చ జరుగుతోంది. అయితే, దీని పైన చంద్రబాబు పార్టీ అధినేతలు సీట్లపై నిర్ణయం తీసుకుంటా రని స్పష్టం చేసారు. కాగా, తాజాగా జనసేన సమావేశంలో ఈ ఎన్నికల పైన కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల పై జనసేన ఒక నిర్ణయానికి వచ్చింది. పార్టీ నేతలకు ఈ మేరకు దిశా నిర్దేశం చేసారు. 'స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ర్టైక్ రేట్ సాధించడం మన లక్ష్యం కావాలి. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంకల్పం ఇదే' అని జనసేన స్థానిక ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశంలో ఆ పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో వ్యూహాలు భిన్నంగా ఉంటాయని, అభ్యర్థుల ఎంపిక దశ నుంచే పార్టీ నిర్దేశించే నియమాల ప్రకారం ముందుకు వెళ్లాలని పవన్ సూచించారని చెప్పారు. అందుకు అనుగుణంగా ఎన్నికల కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్దామని పిలుపు ఇచ్చారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల కోసం సిద్దం కావాలని సూచించారు. డివిజన్లు, వార్డుల్లో బలాబలాలు గుర్తించాలని నిర్దేశించారు.

జనసేన లో పోటీకి పెరుగుతున్న ఒత్తిడి
కూటమిలో భాగస్వామిగా ఉండటంతో పొత్తుల అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో కూటమి సమన్వయ కమిటీ చర్చలు నడుస్తున్నాయని, జిల్లా, నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలు ఉంటాయని తెలిపారు. జనసేన స్థానిక ఎన్నికల కమిటీ సభ్యులకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగిస్తారని చెప్పారు. సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి క్యాడర్‌ను కలవాలని, ఎన్నికలకు సమాయత్తం చేయాలని, వారి అభిప్రాయాలను కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. ఇప్పటి నుంచి 30 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికను పవన్ సిద్ధం చేశారని, దీన్ని అందరూ తప్పకుండా పాటించాలని మనోహర్ స్పష్టం చేసారు. 2024 ఎన్నికల్లో త్యాగం చేసిన చోట్ల కూడా తగిన అవకాశాలు కల్పించాలన్నారు. పవన్ జన్మదినం సెప్టెంబరు 2న యువజన విభాగాన్ని మొదలు పెట్టబోతున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఆవిష్కరిస్తామని ప్రకటించారు.













Click it and Unblock the Notifications