ముద్రగడ పేరు మార్పు ముహూర్తం..!!
ఏపీలో ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. వైసీపీ ఘోర పరాభవం ఎదుర్కొంది. గెలుపు పైన జగన్ స్పందించారు. తాను ఎంతో మందికి మేలు చేసానని...వారి ఆప్యాయత ఏమోందో అంటూ ఆవేదన చెందారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని...పేదల కు వాయిస్ గా నిలబడుతానని చెప్పారు. ఇదే సమయంలో పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని నాడు మద్రగడ సవాల్ చేసారు. ఇప్పుడు పవన్ గెలుపుతో ఆ అంశం పై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
పవన్ గెలుపుతో
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీ నేత వంగా గీతపై ఘన విజయం సాధించారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ బరిలో దిగిన సమయంలో.. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే.. తాను పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ శపథం చేశారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలతో కూటమి అధికారంలోకి రానుండగా.. పవన్ కల్యాణ్ సైతం గెలుపొందారు.

ముద్రగడ సవాల్ పై
ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు నాడు చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నారా..పేరు మార్పుకు సిద్దమా అని ప్రశ్నిస్తున్నారు. రు మార్చుకునే క్రమంలో మీరు ఏ పేరు పెట్టుకుంటారంటూ వారు సందేహం సైతం వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా మీరు ఉన్నారు కనుక పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవాలని ముద్రగడకు ఈ సందర్భంగా వారు సూచిస్తున్నారు. అయితే నామకరణం మార్పు డేట్.. టైమ్ చేబితే తామంతా ఆ కార్యక్రమానికి వస్తామని ముద్రగడకు నెటిజన్లు సూచిస్తున్నారు.

పేరు మార్పు వ్యవహారం
తాజా ఫలితాలతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ మారే ఉద్దేశ్యం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే.. పేరు మార్పు కార్యక్రమం వాయిదా వేసుకోవాలని ఆయనకు ఉచిత సలహా ఇస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవటం..పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించటంతో ముద్రగడ ఎలా స్పందిస్తారు..గతంలో తాను చేసిన సవాల్ కు కట్టబడి ఉంటారా..ఎలాంటి సమాధానం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications