పవన్ ఎక్కడా అలా చెప్పలేదు.. అతని వల్లే తప్పుగా!: హోదా యూటర్న్‌పై జనసేన
హైదరాబాద్: హోదాపై పవన్ 'యూటర్న్' అన్న వార్త సోమవారం కలకలం రేపింది. నిన్న గాక మొన్ననే కదా.. గుంటూరు సభలో పవన్ హోదాపై టీడీపీని కడిగిపారేసి.. అవసరమైతే ఆమరణదీక్షకైనా సిద్దమంటూ ప్రకటించారు. మళ్లీ ఇంతలోనే ఎలా మాట మార్చేశారబ్బా? అని చాలామంది ఆశ్చర్యపోయారు.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకు జనసేన కట్టుబడి ఉంది. పార్టీ అధ్యక్షుడు @PawanKalyan గారి అభిప్రాయాన్ని న్యూస్ 18 రిపోర్టర్ పొరపాటుగా అర్ధం చేసుకున్నారు.
— JanaSena Party (@JanaSenaParty) March 19, 2018
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ దీనిపై వివరణ ఇచ్చింది. పవన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అలా ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొంది. రిపోర్టర్ పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది. ప్రత్యేక హోదా సాధనకు జనసేన ఇప్పటికీ కట్టుబడి ఉందని తెలిపింది.

కాగా, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఏపీకి తక్షణ సహాయం కావాలని, అది హోదానా? ప్యాకేజీనా? అన్నది పెద్ద విషయం కాదని పవన్ వ్యాఖ్యానించినట్టుగా న్యూస్18 అనే మీడియా సంస్థ పేర్కొంది. దీంతో తెలుగు మీడియా సైతం ఆ వార్తను హైలైట్ చేసింది. ఈ వార్తతో జనసేన శ్రేణులు సైతం ఒక్కసారిగా షాక్ తిన్నారు. పవన్ అభిప్రాయాలను రిపోర్టర్ తప్పుగా అర్థం చేసుకున్నారని ట్విట్టర్ ద్వారా జనసేన ప్రకటించింది.












Click it and Unblock the Notifications