ఇప్పటం లో పవన్ కల్యాణ్, పార్టీ నేతల ఫైటింగ్..!!
డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటం గ్రామానికి వెళ్తున్నారు. 2022 లో వైసీపీ అధికారంలో ఉన్న సమయం లో పవన్ ఇప్పటం పర్యటన సంచలనంగా నిలిచింది. ఆంక్షల నడుమ పవన్ కారు పైన కూర్చొని ఇప్పటం వెళ్లారు. ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. గ్రామస్థుల ఇళ్లను కూల్చటం పైన మండిపడ్డారు. వారికి మద్దతుగా నిలిచారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఇప్పటం వెళ్తున్నారు. కాగా.. ఇదే సమయంలో జనసేన నేతల వేళ వర్గ పోరు .. కుర్చులతో ఫైటింగ్ పార్టీకి సమస్యగా మారింది.
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. 2022 మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్థులు తమ భూములు ఇచ్చారు. ఆ సమయంలో చిన్న గ్రామంలో 100 అడుగుల మేర రోడ్డు విస్తరణ పేరుతో జనసేన సానుభూతిపరుల ఇళ్లు, ప్రహారీలు కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2022 నవంబర్ 4న జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కల్యాణ్ నవంబర్ 5వ తేదీన ఇప్పటం గ్రామాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు.

ఆ సమయంలో పవన్ ఇప్పటం వెళ్లేందుకు సిద్దం అవుతుండగా పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో, ఆగ్రహించిన పవన్ వాహనం పైన కూర్చొని.. మద్దతు దారులతో కలిసి ఇప్పటం వెళ్లారు. అక్కడ పవన్ ఎన్నికల్లో గెలిచాక మళ్లీ ఇప్పటం గ్రామానికి వస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటం గ్రామానికి వెళ్లాలని నిర్ణయించారు. పవన్ పర్యటన కోసం జనసేన పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు గ్రామంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇదే సమయంలో పవన్ పర్యటన ఏర్పాట్లలో భాగంగా జనసేన నేతలు వర్గాలుగా మారి గొడవకు దిగారు. కుర్చీలతో కొట్టుకొన్నారు. నాడు ఇండ్ల నాగేశ్వరమ్మకు ఇచ్చిన హామీ మేరకు తన పర్యటనలో పవన్ మరోసారి నాగేశ్వరమ్మతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ నేతలు పవన్ పర్యటన వేళ.. గొడవ పడటం.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఘర్షణ కు దిగటం తో ఉద్రిక్తతకు కారణమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పర్యటన ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications