అమరావతిలో రాజధానిపై జనసేన నేత బొలిశెట్టి సత్య క్లారిటీ !

ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అమరావతిలో రాజధాని పనుల్ని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన ఓ సూచన చర్చనీయాంశమైంది. గతంలో ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి నగరాల్లో నదీ ప్రవాహాలకు సమీపంలో రాజధాని కట్టడాలు నిర్మించడం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ అమరావతిలో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. కానీ దీనిపై వైసీపీ అనుకూల మీడియా గ్రూపుల్లో అమరావతి రాజధానికి వ్యతిరేకంగా గళమెత్తి చంద్రబాబు, పవన్ మధ్య చిచ్చు పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది.

దీనిపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఓ వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానల్లో ఈ మేరకు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రసారం చేసిన కథనంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొలిశెట్టి ఎక్స్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇందులో అమరావతి రాజధానిపై తన స్టాండ్ స్పష్టం చేస్తూనే, గతంలో తాను చేసిన సూచన వెనుక ఉద్దేశాన్ని కూడా మరోమారు వెల్లడించారు. అంతే కాదు వైసీపీ ఫేక్ ప్రచారంపైనా ఆయన మండిపడ్డారు.

janasena leader bolisetty Satyanarayana clarified to his opinion on Amaravati capital

కొన్ని వందల డిబేట్లలో తాను విశాఖపట్నం వాసినై ఉండి రాజధాని అమరావతిలోనే కట్టాలి అని చెప్పిన సాక్ష్యాలు దాఖలాలు ఉన్నాయని, అలానే అమరావతి రాజధాని అని నిర్ణయించాక రాజధాని విశాఖపట్నంలో కట్టాలని తానెప్పుడూ డిమాండ్ చేయలేదని బొలిశెట్టి సత్య స్పష్టం చేశారు. ఎందుకంటే అమరావతి అన్నది శాసనసభ, శాసనమండలి పూర్తి మద్దతుతో ఏర్పడిన రాజధాని అని, దానిని మార్చడం సాధ్యం కాదని తెలిపారు.

అయితే ఆ మధ్య నది పరివాహక ప్రాంతం ప్రాంతంలో కట్టడాలు ఉండడం వల్ల వరదలు వచ్చినప్పుడు అవి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, యమునా నదిలో గంగా నదిలో కొట్టుకుపోతున్న వాహనాల వీడియోని పెడుతూ అటువంటి పరిస్థితి మన కృష్ణ, గోదావరిలో రాకుండా నివారించాలని అలా చేయాలంటే నదీ పరివాహ ప్రాంతాన్ని నదికి వదిలేయాలి అని మాత్రమే చెప్పానని బొలిశెట్టి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి మన రాజధాని అమరావతి, దానిని వీలైనంత తొందరగా కట్టాలి అన్నది కూటమి లక్ష్యం.. దీనిని అడ్డుకోవడం సాధ్య కాకనే వైసీపీ పెయిడ్ గోబెల్స్ ప్రచారం చేస్తోందంటూ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+