పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను చావుదెబ్బ కొట్టిన జగన్
సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరు జనసేనను వీడుతున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు జనసేన నుంచి బయటకు రాగ, తాజాగా మరో కీలక నేత జనసేనకు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. పిఠాపురం జనసేన కీలక నేతగా ఉన్న శేషుకుమారి ఆ పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చారు.
జగన్ సమక్షంలో ఆమె వైసీపీ కండవా కప్పుకున్నారు.మాకినీడి శేషుకుమారి జనసేన పిఠాపురం ఇంచార్జ్‌గా పని చేశారు. గత ఎన్నికల్లో ఆమె జనసేన తరుఫున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. శేషు కుమారి జనసేనను వీడటంతో ఆ ప్రభావం పవన్ కల్యాణ్ గెలుపుపై పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న తరుణంలో పవన్ కల్యాణ్‌కు ఝలక్ ఇస్తూ.. కీలక నేతను తమ పార్టీలో చేర్చుకుని అధికార పార్టీ గట్టి షాకిచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకున్నారు.
అటు అధికార వైసీపీ సైతం పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే ముద్రగడ, హరిరామ జోగయ్య కుమారుడును పార్టీలో చేర్చుకుని ఉభయ గోదావరి జిల్లాలో పట్టు పెంచుకున్న వైసీపీ.. తాజాగా పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం నుంచే బలమైన నేతను తమ పార్టీలో చేర్చుకుంది.
ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. పిఠాపురం నుంచి వంగా గీత బరిలో ఉండగా, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు నియోజకవర్గ ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు దీనిలో భాగంగానే మాకినీడి శేషుకుమారితో చర్చలు జరిపిన నేతలు..ఆమెను వైసీపీలోకి తీసుకువచ్చేలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బుధవారం సాయంత్రం తాడేపల్లికు చేరుకున్న శేషుకుమారి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.












Click it and Unblock the Notifications