Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన కీలక నేతకు టీడీపీ ఆఫర్ - పవన్ పై ఒత్తిడి : రంగంలోకి సీనియర్ నేత..!?

జనసేన ముఖ్య నేతను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ సీనియర్ నేత ప్రయత్నాలు.

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులు ఖాయమని భావిస్తున్నల వేళ కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో జనసేనలో చేరాల్సిన నేతలు టీడీపీలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇటు జనసేనలోని ముఖ్య నేతకు టీడీపీ సీనియర్ల నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీని పైన ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

టీడీపీ- జనసేన పొత్తు వేళ కీలక పరిణామాలు

టీడీపీ- జనసేన పొత్తు వేళ కీలక పరిణామాలు


తెలుగు దేశం - జనసేన పొత్తు ఖాయమని అందరూ భావిస్తున్నారు. కానీ, పాత్తుపైన రెండు పార్టీల నుంచి అధికారక స్పందన లేదు. ఇదే సమయంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చిన జనసేన ఎవరికి వేయాలనేది మాత్రం ఓపెన్ గా చెప్పలేదు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్ధులు తాము బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నాయి. జనసేన మాత్రం బీజేపీ అభ్యర్ధికి మద్దతివ్వాలని ఎక్కడా చెప్పటం లేదు. కొద్ది రోజులుగా పవన్ తీరులోనూ మార్పు కనిపిస్తోంది. గతంలో పవన్ కు మద్దతుగా టీడీపీ...చంద్రబాబుకు మద్దతుగా పవన్ ప్రకటనలు ఇచ్చారు. కానీ, గన్నవరం టీడీపీ కార్యాయలం పైన దాడి జరిగితే జనసేన ఎక్కడా ఖండించలేదు. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరటం ఖాయం అనుకున్న వేళ ఆయన టీడీపీ లో చేరారు. మరో వైపు టీడీపీ నాయకత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం వామపక్ష పార్టీలతో చర్చలు చేస్తోంది.

నాదెండ్ల మనోహర్ కు టీడీపీ సీనియర్ ఆఫర్..!

నాదెండ్ల మనోహర్ కు టీడీపీ సీనియర్ ఆఫర్..!


ఇదే సమయంలో అనూహ్య పరిణామం తెర మీదకు వచ్చింది. జనసేనలో దాదాపు నెంబర్ టు స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ సీనియర్ నేత ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నాదెండ్ల వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. గతంలో ఆయన జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి టీడీపీ నుంచి ఆ సీటులో పోటీ చేస్తే విజయం ఖాయమని జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తు దిశగా జనసేనలో ఆ నేత తన వంతు ప్రయత్నం చేసారనే ప్రచారం ఉంది. పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉన్నా లేకున్నా గెలుస్తామనే ధీమా కొంత కాలంగా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ సీట్ల విషయంలో ఒత్తిడి పెంచకుండా.. బీజేపీ వైపు చూడకుండా తమతో కలిసి వచ్చేలా ఒత్తిడి పెంచే వ్యూహం టీడీపీ నుంచి మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కీలకంగా మారనున్న చంద్రబాబు నిర్ణయం

కీలకంగా మారనున్న చంద్రబాబు నిర్ణయం


టీడీపీ - జనసేన పొత్తు విషయంలో ఇప్పుడు ఈ చేరికల వ్యవహారం కీలకంగా మారుతోంది. జనసేనతో పొత్తు దిశగా అడుగులు పడుతున్న వేళ టీడీపీలో చేరికలు పెరుగుతున్నాయి. నాదెండ్ల మనోహర్ ను టీడీపీ లోకి తీసుకొచ్చేందుకు ఒక సీనియర్ నేత తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, నాదెండ్ల మనోహర్ నిర్ణయం ఏంటనేది స్పష్టత రాలేదు. పవన్ తో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆయన పార్టీని కాదని టీడీపీలోకి వెళ్లే అవకాశం సాధ్యపడదనే అభిప్రాయం ఉంది. కానీ, పార్టీలోని సీనియర్ మాత్రం మనోహర్ ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబుతోనూ చర్చించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో, ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. టీడీపీ -జనసేన మధ్య పొత్తులో మనోహర్ ది కీలక పాత్ర అని వైసీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపణలు చేసారు. దీంతో..ఇప్పుడు మనోహర్ కేంద్రంగా సాగుతున్న ఈ ప్రచారానికి ఎటువంటి ముగింపు వస్తుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+