వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాంటి సీఎం ఎందుకు? మంత్రులు, ఎమ్మెల్యే ఎన్నికలప్పుడేనా?: పవన్ ఆదేశాలంటూ నాదెండ్ల

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలో ఉన్న వారి ఇసుక దాహం.. విపరీతమైన ధన దాహం కారణంగానే గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతున్నాయని స్పష్టం చేశారు. కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చి తద్వారా సృష్టించిన విధ్వంసం పచ్చటి కుటుంబాల్లో విషాదం నింపిందని ధ్వజమెత్తారు.

ఇసుక మాఫియా కారణంగానే భారీ నష్టం: నాదెండ్ల

ఇసుక మాఫియా కారణంగానే భారీ నష్టం: నాదెండ్ల

ఇసుక మాఫియాలో రాజకీయ నాయకుల ప్రమేయం కారణంగా దోపిడి పెరిగిపోయిందన్నారు నాదెండ్ల మనోహర్. అధికార పార్టీకి చెందిన ఏ నాయకుడికీ ఈ విపత్తు ప్రకృతి వల్ల వచ్చిందని చెప్పే నైతిక ధైర్యం లేదన్నారు. బుధవారం అన్నమయ్య డ్యాం కట్ట తెగి వచ్చిన వరదల కారణంగా భారీగా నష్టపోయిన కడప జిల్లా, ఎగువమందపల్లి గ్రామంలో జనసేన పార్టీ డాక్టర్స్ సెల్ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించారు. మందపల్లి గ్రామంలో వరదలు సృష్టించిన విలయానికి 12 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. ఆ గ్రామంలో పర్యటన సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.

ప్రజలకు ఆపదొస్తే.. మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించరే?

ప్రజలకు ఆపదొస్తే.. మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించరే?

అధికారులు ప్రజలకు ఆలస్యంగా సమాచారం అందించారు. రెండు మూడు రోజుల ముందు అప్రమత్తం చేసి ఉంటే ఎవరికి వారు జాగ్రత్త పడేవారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదు. అక్రమార్జన ధ్యేయంగా రాజకీయ నాయకులు చేసిన పనుల వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించాయి. ప్రజలంతా ఆ విషయాన్ని గమనించాలి. ముఖ్యమంత్రి చిన్న చిన్న ఎలక్షన్ కోసం గ్రామాల్లో, పట్టణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంఛార్జులుగా పెట్టి, మకాం వేయించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మరీ ఓట్లు వేయించుకుంటున్నారు. మరి ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఒక్క మంత్రి కూడా గ్రామాల్లో ఎందుకు మకాం వేయడం లేదు? శాసన సభ్యులు ఎందుకు ఈ ప్రాంతాలకు వచ్చి తిరగడం లేదు. ప్రజలు మంచి ప్రభుత్వం కోసం, పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో ఓటు వేశారు. అధికార యంత్రాంగాన్ని చూసి ఓటు వేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారి వ్యవహార శైలి చూస్తే విచిత్రంగా అనిపిస్తోంది. వారి వ్యాపారం కోసం వేసిన ఎత్తుగడల వల్ల ఇంత నష్టం వాటిల్లింది. సొంత జిల్లాకు ఆపద వస్తే ముఖ్యమంత్రి ఈ రోజు వరకు పర్యటించలేదు. భరోసా కల్పించే నాయకుడి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. .

 పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన జనసేన..

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన జనసేన..

మా వంతుగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మందపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ డాక్టర్స్ సెల్ ఈ క్యాంపు ఏర్పాటు చేశారు. వైద్య సేవలతో పాటు మందులు కూడా అందించే విధంగా వైద్యులు ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ తరఫున నిత్యవసర వస్తువులు, కొంత మొత్తం ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూసి అన్ని జిల్లాల నుంచి మా పార్టీ నాయకులు భరోసా కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఎవరి వంతు వారు సాయం పంపుతున్నారు. పవన్ కళ్యాణ్ తరఫున దాతలందరికీ ధన్యవాదాలు. వరదలు ముంచెత్తిన సమయంలో అర్ధరాత్రి వేళ కూడా యువకులు, జనసైనికులు చాలా మంది ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు తెలియచేస్తున్నాం. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టింది లేదన్నారు నాదెండ్ల. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్,పెదపూడి విజయ్ కుమార్, తాతంశెట్టి నాగేంద్ర, ముకరం చాంద్, సుంకర శ్రీనివాస్, డాక్టర్ బోనాసి వెంకట సుబ్బయ్య, మలిశెట్టి వెంకటరమణ, ఆకెపాటి సుభాషిణి,చెంగారి శివప్రసాద్, జనసేన డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, వైస్ ఛైర్మన్ డాక్టర్ గౌతమ్ రాజ్, డాక్టర్ డి.రెడ్డిప్రసాద్, డాక్టర్ వి.రెడ్డి ప్రసాద్, డాక్టర్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇలాంటి సీఎం ఎందుకు?: నాదెండ్ల

ఇలాంటి సీఎం ఎందుకు?: నాదెండ్ల

వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన నిర్వాసితులు చెట్ల కింద బతుకుతుంటే ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా ఏరియల్ సర్వే నిర్వహించి వెళ్లిపోవడం చాలా దురదృష్టకరమన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సొంత జిల్లాకి కష్టం వస్తేస్వయంగా పర్యటించలేని ముఖ్యమంత్రి ఎందుకని నిలదీశారు. హెలీకాప్టర్ వేసుకువచ్చి తిరిగి వెళ్లిపోయి ఎక్కడో కూర్చుకుని కబుర్లు చెబితే ఎలా అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా దెబ్బ తిన్న గ్రామాల్లో పర్యటించి భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి తక్షణం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం మనోహర్ పర్యటించారు. అన్నమయ్య డామ్ కట్ట దిగువ ప్రాంతంలో వరద ముంపుకు గురైన నందలూరు మండలం తొగురుపేటలో బాధితులను పరామర్శించారు. కూలిపోయిన ఇళ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. వరద తీవ్రత, ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. బాధితులకు నిత్యావసరాలు, దుప్పట్లు, పాత్రలు అందించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. "ఎన్నికలు వస్తే మండలానికో మంత్రిని, గ్రామానికో శాసనసభ్యుడిని పంపే పాలకులు ప్రజలు కష్టాల్లో ఉంటే సాయం అందించేందుకు మాత్రం ముందుకు రావడం లేదని జనసేన పార్టీ స్పష్టం చేశారు. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతే ప్రజలకు సాయం అందించడానికి మండలానికో మంత్రిని ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. ఇంత విపత్తు వస్తే సహాయం కోసం జిల్లాకు రెండు కోట్ల రూపాయలా ఇచ్చేది? ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇన్ని కుటుంబాలు రోడ్డున పడితే స్థానికంగా ఉన్న నాయకులు ఏమయ్యారు? ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇతర గ్రామాల నుంచి ప్రజలు వచ్చి సాటి వారికి సాయం అందిస్తుంటే ప్రభుత్వం నుంచి ఎందుకు సహాయ కార్యక్రమాలు లేవో తెలియడం లేదు'అని మండిపడ్డారు నాదెండ్ల.

ప్రతిపక్షాలను దూషించేవాళ్లు.. ప్రజల కష్టాలకు స్పందించరా?

ప్రతిపక్షాలను దూషించేవాళ్లు.. ప్రజల కష్టాలకు స్పందించరా?

సీఎం లక్షల కోట్ల బడ్జెట్ అని పెద్దపెద్ద మాటలు చెబుతారుగానీ సొంత జిల్లాలో మాత్రం పర్యటించలేరు. ఇంతకంటే అధ్వాన్నమైన పరిస్థితి ఉంటుందా. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు, గుళ్ళు కొట్టుకుపోయాయి, రహదారులు, చెట్లు, పశుసంపద పోయింది. పొలాలు పోయాయి. నాలుగు రోజులుగా కనీసం వైద్య సదుపాయాలు లేవు. ఇప్పటి వరకు గ్రామాలకు కరెంటు సదుపాయం కూడా పునరుద్ధరించ లేదు. చిన్నపిల్లలతో బిక్కుబిక్కు మంటూ ఆరుబయట ఇసుకలోనే కాలం వెళ్లదీసే పరిస్థితి కనిపిస్తోంది. కడప నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అందరికంటే పెద్ద మంత్రి ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. ఏమైనా ప్రశ్నిస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలను దూషిస్తారు. ప్రజలకు కష్టం వస్తే మీరెందుకు రావడం లేదు. మీరు ఎందుకు మాట్లాడడం లేదు. ప్రజలు కలెక్టర్ కి, ఆర్డీవోకి ఓటు వేశారా? మంచి పాలన అందిస్తారని శ్రీ జగన్ రెడ్డి గారిని సొంత కుమారుడిగా భావించి ఆశీర్వదించి ప్రజలు ఓటు వేశారు. 151 సీట్లు కట్టబెడితే ఇలా ప్రవర్తించడం చాలా బాధ కలిగిస్తోంది. ఇళ్లు కొట్టుకుపోయి మహిళలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఏమైపోయారో తెలియడం లేదు.

ఇసుక మాఫియా స్వార్థంతోనే ఈ భారీ విపత్తు.. పవన్ ఆదేశాలతో..

ఇసుక మాఫియా స్వార్థంతోనే ఈ భారీ విపత్తు.. పవన్ ఆదేశాలతో..

మానవ తప్పిదం కారణంగానే ఈ విపత్తు వచ్చింది. కేవలం ఇసుక మాఫియా స్వార్ధం కారణంగానే గ్రామాలకు గ్రామాలు మునిగిపోయాయి. ఈ విపత్తు మానవ తప్పిదం. వారి వ్యాపారాల కోసం, ఇసుకను దోచుకోవడం కోసం నీటిని ఆపేసి ఇంతటి దారుణ విలయానికి కారకులయ్యారు. ఇసుక వ్యాపారం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారు. మీరు సంపాదించింది సరిపోక దోచుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తుంటే మిమ్మల్ని ఏమనాలి. ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం. పరిపాలనా దక్షత లేని ముఖ్యమంత్రి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంటి నుంచి రెండు వీడియో కాల్స్ పెట్టుకుని అద్భుతంగా అభివృద్ధి జరుగుతోందని చెబుతున్నారు. ఈ రోజు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ జనసేన బాధిత ప్రజల మధ్యకు వచ్చాం. గ్రామాల్లో పర్యటించి బాధితుల్ని మనవంతు ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సర్వస్వం కోల్పోయిన వారి కోసం పార్టీ తరఫున నిత్యావసర సరుకులు, వస్తు సామాగ్రి, దుప్పట్లు అందచేస్తున్నాం. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. మొదటి విడత జనసేన పార్టీ పర్యటనల్లో భాగంగా వరద నష్టాన్ని అంచనా వేసిన తర్వాత రెండో విడత పవన్ కళ్యాణ్ స్వయంగా వస్తారు. ఇక్కడ ఉన్న అధ్వాన్నమైన పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. జగన్ రెడ్డి పాదయాత్ర చూసి మురిసిపోయిన వారంతా ఇక్కడికి వచ్చి ప్రజల దుస్థితి చూడండి. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో హృదయ విదారక పరిస్థితులు ఉన్నా. తొగురుపేట వెళ్ళేందుకు ముందుగా చొప్పవారిపల్లె వద్ద బస్సులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రయాణీకులు గల్లంతైన ప్రాంతాన్ని నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులుపెదపూడి విజయ్ కుమార్, డా. పసుపులేటి హరిప్రసాద్, తాతంశెట్టి నాగేంద్ర, ముకరం చాంద్, సుంకర శ్రీనివాస్, డా. వెంకట సుబ్బయ్య, మలిశెట్టి వెంకటరమణ, పత్తిపాటి కుసుమకుమారి, కనకరాజు, ఆకెపాటి సుభాషిణి, కిరణ్ రాయల్, డా.బొడ్డేపల్లి రఘు, డా.పాకనాటి గౌతమ్ రాజ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Janasena leader Nadendla Manohar slams AP CM YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X