కడుపుతో ఉన్న మహిళా వాలంటీర్‌పై కూటమి నేతలు అమానుషం
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్ వ్యవస్థ చూట్టూనే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన టీడీపీ, జనసేన పార్టీలు..ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థకు జై కొడుతున్నాయి. జగన్ ప్రభుత్వం రూ.5000 రూపాయిలు వేతనం ఇస్తుంటే..తాము అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లకు రూ.10,000 రూపాయిల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. గతంలో ఇదే చంద్రబాబు వాలంటీర్లను గోనె సంచులు మోసుకునే ఉద్యోగం అని ఎద్దెవా చేశారు.
మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం వాలంటీర్లను విధుల నుంచి తొలగించింది. దీంతో కొందరు వాలంటీర్లు స్వచ్ఛందంగానే తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఇదిలా ఉంటే వాలంటీర్లపై కూటమి నేతలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారింది. ఆరుగురు వాలంటీర్లను కాకినాడ జనసేన నేతలు ఓ రూమ్‌లో బంధించారు. అందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. వారిలో ఒకరు గర్భిణి కూడా ఉన్నారు.

ఈ ఘటన కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని రమణయ్యపేటలో చోటు చేసుకుంది. పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటున్న వాలంటీర్లను జనసేన నేతలు ఓ గదిలో బంధించారు. దాదాపు రెండు గంటల పాటు వారిని అక్కడే ఉంచి చిత్రహింసలు పెట్టారు.తలుపు తీయమని ఎంత వేడుకున్నా జనసేన నేతలు కనికరించలేదు.
లోపల గర్భిణి ఉందని చెప్పినా పట్టించుకోలేదు. భయాందోళనలతో ఇద్దరు వాలంటీర్లు సొమ్మసిల్లి పడిపోవడంతో చివరకు వారు తలుపు తీశారు. వాలంటీర్లపై అంత అనుమానం ఎందుకు ప్రవర్తించారని ప్రశ్నిస్తే.. వాలంటీర్లంతా ఒకచోట చేరింది ఎన్నికలకోసమే అని సమాధానం ఇచ్చారు. జనసేన నేతల అమానుష ప్రవర్తనపై . వాలంటీర్లు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. జనసేన పార్టీ హింసాత్మకంగా, బెదిరింపులకు దిగడాన్ని పలువురు ఖండిస్తున్నారు.












Click it and Unblock the Notifications