వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవే నా చివరి ఎన్నికలన్న చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్‌తో పోల్చి బాబుకు వీడియోలతో షాకిస్తున్న జనసైనికులు

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే నాకు చివరి ఎన్నికలు.. మీరు గెలిపించి పంపిస్తే సరే లేదంటే ఇక మీ ఇష్టం అంటూ చంద్రబాబు పత్తికొండలో నిర్వహించిన సభలో భావోద్వేగానికి గురై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. అధికారం లేకపోతే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తుంటే, మరికొందరు నిజంగానే చంద్రబాబు రాజకీయాల నుండి పక్కకు జరిగితే, జనసేన పార్టీకి బాగా కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై జనసైనికుల షాకింగ్ పోస్టులు


చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలతో టీడీపీని, చంద్రబాబును వైసీపీ టార్గెట్ చేస్తుంది అనుకుంటే అందుకు భిన్నంగా జనసైనికులు స్పందిస్తున్నారు. చంద్రబాబు తాజా సంచలన ప్రకటన పట్ల జనసేన కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓడించినా ప్రజాక్షేత్రంలో ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఓడిపోతే ఇవే నా చివరి ఎన్నికలు అంటున్న 40 ఏళ్ల విజనరీ చంద్రబాబు ఎక్కడ? అని ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొందరు చంద్రబాబునాయుడుకు 2019 తోనే చివరి ఎన్నికలనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు విజన్ గత ఎన్నికల ఓటమితో 2020తో ముగిసిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక జనసేన పార్టీ పరిపాలించే కొత్త శకం 2024లో ప్రారంభమవుతుందని జనసైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీడియోలతో పోస్టుల రచ్చ

చంద్రబాబు తీసుకున్న నిర్ణయం శుభ పరిణామం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. గెలిచినా ఓడినా మీతోనే ఉంటాను అన్న పవన్ కళ్యాణ్ కు.. మీరు గెలిపించుకోపోతే ఇదే నా చివరి ఎన్నికలు అంటున్న చంద్రబాబుకు ఎంత తేడా ఉందో చూడండి అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో లను షేర్ చేసి మరీ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షం వహిస్తా అన్న పవన్ కళ్యాణ్ కు బాబుకు తేడా

ఇక ఇదే సమయంలో పవన్ చిత్తశుద్దికీ ఇతరుల అధికార దుర్భుద్దికి తేడా ఇది అంటూ కొందరు చంద్రబాబు వ్యాఖ్యలను కౌంటర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పదవులు లేకున్నా ప్రజల కోసం పోరాడుతాం అంటే, అధికారం లేకుండా ఎమ్మెల్యేగా ఉన్న సభలోకి అడుగుపెట్టనని 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు చెబుతున్నారని అంటున్నారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షం వహిస్తాను అన్న జనసేనానికి, నన్ను ఓడిస్తే ఇవే నా చివరి ఎన్నికలు అన్న బాబు కి తేడా ప్రజలు అర్థం చేసుకోవాలని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ప్రకటనతో జనసేనలో జోష్.. భవిష్యత్ పాలన జనసేనదే

చంద్రబాబు ప్రకటనతో జనసేనలో జోష్.. భవిష్యత్ పాలన జనసేనదే

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వల్ల జనసేన పార్టీకి, జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవే తన చివరి ఎన్నికలని వ్యాఖ్యలు చేయడంతో జనసేన పార్టీ కార్యకర్తలకు పండగ చేస్తున్నట్టుంది. ఒకవేళ అదే జరిగితే జనసేన పార్టీకి పట్టు దొరుకుతుందని, భవిష్యత్తులో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, వచ్చేఎన్నికలలో జనసేన రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తాయా? లేదా జనాల సానుభూతి టిడిపి పట్ల పెరుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ ప్రకటన జనసేనకు కలిసొస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

English summary
Janasena leaders are mentioning difference with the videos of Pawan Kalyan and chandrababu. pawan said win or lose , he fights for people and Chandrababu said if he loses this will be the last election for him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X