ఎన్నికల వేళ జనసేనలో కొత్త టెన్షన్ - వైసీపీకి కలిసొస్తుందా..!!

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. తనకు సీఎం గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు జనసేన కామన్ సింబల్ గురించి ప్రస్తావిస్తున్నారు. చెప్పులు పోతే నిర్మాతలు కొనిస్తారు..కామన్ సింబల్ పోయిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సింబల్ వ్యవహారం జనసేనకు సమస్యగా మారుతోంది. పొత్తులతో ముందుకు వెళ్లే సమయంలో టీడీపీలోనూ ఈ చర్చ సాగుతోంది.

జనసేన గుర్తు పై చర్చ:వారాహి యాత్ర సమయంలో అధికార వైసీపీ పైన పవన్ కల్యాన్ విమర్శల దాడి పెంచారు. తనకు వరసగా రెండు ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. రెండేళ్ల తరువాత తన పాలన నచ్చకపోతే దిగి వెళ్లిపోతానని చెబుతున్నారు. పొత్తుల ప్రస్తావన చేయకపోవటం.

Janasena lost common symbol up to 2025 as ECI Decisions, may effect on next elections

.పదే పదే సీఎంను చేయమంటూ కోరటం వంటి పవన్ కొత్త రాజకీయాన్ని టీడీపీ ఆసక్తిగా గమనిస్తోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పిఠాపురం సభలో తన రెండు చెప్పులు పోయాయంటూ చేసిన సెటైరికల్ కామెంట్స్ పైన వైసీపీ నేతలు స్పందించారు. పేర్ని నాని తన ఒక చెప్పు గతంలో పోయిందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో పార్టీ సింబల్ పోయిందని..ఆ సంగతి చూసుకోవాలని పవన్ కల్యాణ్ కు సూచించారు.

కామన్ సింబల్ లేకపోతే:జనసేనకు కొద్ది కాలం క్రితం వరకు కామన్ సింబల్ గా గాజు గ్లాసు ఉండేది. ఈ మధ్య కాలంలో పార్టీలకు గుర్తుల కేటాయింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏపీలోని మూడు ప్రాంతీయ పార్టీలకు రిజర్వుడ్‌ గుర్తుల కేటాయింపు జరిగింది.

ఏపీతో పాటుగా 8 జాతీయ పార్టీలకూ రిజర్వుడ్‌ గుర్తులు ఖరారు చేసింది. అయితే, వాటిలో జనసేన పార్టీ పేరు ప్రస్తావన లేదు. దీంతో..జనసేన సింబల్ గా ఉన్న గాజు గ్లాసు ఇక ఉండదని చెబుతున్నారు. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వుడ్‌ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ స్పష్టం చేస్తోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్‌ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్‌లో ఫ్రీ సింబల్స్‌ కేటగిరిలో పేర్కొంది.

Janasena lost common symbol up to 2025 as ECI Decisions, may effect on next elections

2025 వరకు సాధ్యం కాదా:సంబంధింత గుర్తును రిటర్నింగ్‌ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్‌ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్‌ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు.

దీని పైన జనసేన కామన్ సింబల్ పైన ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కానీ, ఆ అభ్యర్ధనను తిరస్కరిస్తూ ..మరలా 2025 చివరి వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కామన్ సింబల్ కేటాయింపుకు అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు జనసేన తమ కామన్ సింబల్ పైన ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+