జనసేనకు ఆరు జడ్పీ చైర్మన్ స్థానాలు- ఈ సీట్ల కోసం పట్టు, కీలక నిర్ణయం..!!

జెడ్పీ స్థానాల సర్దుబాటు పై కూటమిలో తుది కసరత్తు జరుగుతోంది. 28 జడ్పీ స్థానాల్లో ఏ పార్టీకి, ఎన్ని స్థానాలనే విషయంపై మూడు పార్టీల నేతల మధ్య సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. ముందు ఎన్నికలకు వెళ్లి, అనంతరం స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని మూడు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. జనసేనకు ఆరు స్థానాలు ఇచ్చే విధంగా సూత్ర ప్రాయంగా నిర్ణయం జరిగినా.. మరో మూడు స్థానాల కోసం పట్టు బడుతున్నట్లు తెలుస్తోంది.

జెడ్పీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు.. ఛైర్మన్ స్థానాల పైన కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. జడ్పీలకు పరోక్ష ఎన్నికలు జరుగుతుండటంతో స్థానిక నాయకత్వాలతో మాట్లాడి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. జనసేనకు ఆరు జడ్పీలనైనా కేటాయించాలనే ప్రతిపాదనకు దాదాపు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. బీజేపీకి జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో ఎక్కువ అవకాశం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జడ్పీ, అనకాపల్లి జడ్పీ స్థానాలు జనసేనకు ఖరారయ్యాయి. వీటితోపాటు మరో నాలుగు స్థానాల్లో ఆ పార్టీకి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. బీజేపీకి ఒక్క జడ్పీ ఛైర్మన్ స్థానం కూడా దక్కే అవకాశాలు కనిపించడంలేదు. గోదావరి జిల్లాలతో పాటుగా ప్రకాశం, అనంత జిల్లా జెడ్పీ పీఠాలను తమకు కేటాయించాలని జనసేన పట్టు బడుతోంది.

 జగన్ అనుకున్నదే చేసిన టీడీపీ, గురి పెట్టి.. పడగొట్టి- ఆ ఒక్కటే ఆశ..!!
జగన్ అనుకున్నదే చేసిన టీడీపీ, గురి పెట్టి.. పడగొట్టి- ఆ ఒక్కటే ఆశ..!!
janasena-seeks-six-zp-chairperson-posts-pawan-kalyan-holds-talks-with-tdp-here-the-report

తుది కసరత్తు.. నిర్ణయాలు

మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు దక్కలేదని.. దీంతో, జెడ్పీ సీట్ల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో సీట్లు లేకపోవటంతో.. అక్కడ జెడ్పీ కోసం జనసేన పట్టుబడుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పంపిణీని మాత్రం అధిష్టానం స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లకే వదిలేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు బలంగా పోటీపడుతుండటంతో రాష్ట్ర స్థాయి నుంచి ఒకే ఫార్ములా అమలు చేయకుండా.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని భావిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండటంతో ఉమ్మడి అభ్యర్థుల ఖరారుపై కసరత్తు సాగుతోంది. ఈ సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+