ద్వారంపూడి అనుచరులకు జనసేన టికెట్లు, తెర వెనుక..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో విడత మున్సిపల్ ఎన్నికల వేళ కాకినాడ కేంద్రంగా తాజా నిర్ణయాలు రాజకీయ దుమారం రేపింది. 2024 ఎన్నికల్లో కాకినాడ సహా గోదావరి జిల్లాల్లో జనసేన బలం చాటుకుంది. ద్వారంపూడి పైన పవన్ నేరుగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ద్వారంపూడి అనుచరులకు జనసేన నుంచి అవకాశం ఇవ్వటం పైన రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.

కాకినాడలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. కూటమి లెక్కల్లో భాగంగా కాకినాడ జనసేనకు దక్కింది. వైసీపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. అనేక చర్చల తరువాత కూటమి పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. హోరా హోరీగా మారుతున్న ఈ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులకు జనసేన తరఫున కార్పొరేట్లుగా పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. ఇది ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపింది. కార్పొరేషన్‌ పరిధిలోని 21వ డివిజన్‌ నుంచి జనసేన తరఫున నీలపల్లి రమణి కార్పొరేటర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, ఈమె భర్త నీలపల్లి కామరాజు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడిగా చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ద్వారంపూడితో కలిసి పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న ఆధారాలు బయట పెడుతున్నారు.

 అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
janasena-tickets-to-former-ysrcp-mla-dwarampudi-s-supporters-in-kakinada-spark-controversy

కూటమి నేతల ఫిర్యాదుతో

అయితే, ఈ విషయం తెలిసిన తరువాత కూడా జనసేనలో ఓ వర్గం నేతలు కామరాజు కుటుంబా నికి మద్దతు ఇవ్వడం దుమారం రేపింది. ఇటీవల ఈసీటు కేటాయింపుపై కూటమి నేతల సమా వేశంలో కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నిలదీశారు. ద్వారంపూడి అనుచరు డి భార్యకు టికెట్‌ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నా. అటు జనసేనలో ఒక వర్గం కూడా రమణికి టికెట్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, జనసేనకు చెందిన తోట సుధీర్‌ మద్దతుదారు లు మాత్రం సమర్థిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యాలయానికి కొందరు నేతలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా 37, 41 డివిజన్లలోను ద్వారంపూడి అనుచరులు జనసేన తరఫున నామినేషన్లు వేయడంతో వారి టికెట్లను కూడా రద్దు చేయాలని కూటమి నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. వీరి విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది ఇప్పుడు కాకినాడ ఎన్నికల వేళ ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+