రోజా అక్కా నువ్వు సూపర్.. కొమ్మలు దూకడం నీకు అలవాటే: జనసేన కౌంటర్
సామాన్యులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో తమ నేత పవన్ కల్యాణ్ ఒక్కో అడుగూ వేస్తున్నారని చెప్పుకొచ్చారు
హైదరాబాద్: తలా తోకా లేని పార్టీ అంటూ జనసేనను ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు మంట పుట్టిస్తున్నాయి. రోజా వ్యాఖ్యలపై సుభాషిణి అనే జనసేన మహిళా నేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ వీడియో ద్వారా రోజాకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు.
Recommended Video


మీరు సూపర్ అక్కా
'అక్కా మీరు సూపర్ రోజా అక్కా.. తలా తోకా ఉన్న పార్టీల్లోనే ఉండండి. మాకు తలలే ఉన్నాయి. తోకలు లేవు' అంటూ రోజాకు ఆమె కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, తోకలుండే పార్టీలు వానర పార్టీలు అని, ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకడం మీకు అలవాటేనని ఆమె విమర్శించారు.

పవన్ వల్లే
సామాన్యులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో తమ నేత పవన్ కల్యాణ్ ఒక్కో అడుగూ వేస్తున్నారని చెప్పుకొచ్చారు. దశాబ్దాలుగా వెంటాడుతున్న ఉత్తరాంధ్ర ఉద్దానం కిడ్నీ సమస్యలపై, గుంటూరు జిల్లాలో రైతుల సమస్యలపై స్పందించారని గుర్తు చేశారు. తమ నాయకుడి కృషి వల్లే రైతులకు సీఆర్డీఏ పరిధిలో ప్రభుత్వం ఇస్తానన్న వెయ్యి గజాల ఇంటి స్థలం మరో 200గజాలకు పెరిగిందన్నారు.

అన్ పార్లమెంటరీ భాష
రోజాను నగరి ప్రజలు గెలిపించవచ్చు గానీ అసెంబ్లీ ఆమెను గుర్తించలేదని అన్నారు. ఎలా ఉండకూడదు వంటి అంశాలను కూడా రోజా నుంచి నేర్చుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఆమె ఉపయోగిస్తున్న అన్ పార్లమెంటరీ భాషపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.

మీకు టైం ఇవ్వకపోవచ్చు.. కానీ మాకు
'తప్పు జరిగితే ప్రశ్నించే పార్టీ అక్కా మాది.. మా నాయకుడు పదవే కావాలంటే ఆయన కాళ్ల దగ్గరకు వస్తుంది. మోడీని కలవాలనుకుంటే, మీకు టైం ఇవ్వకపోవచ్చు. కానీ మా నాయకుడికి చిటికెలో ఇచ్చేస్తారు. ఎవరి దగ్గరికెళ్లి ఏదైనా సాధించే సత్తా మాకుంది. ఆ దమ్మూ, ధైర్యం నిజాయితీ కూడా మాలో ఉందక్కా' అంటూ రోజాకు చురకలంటించారు.












Click it and Unblock the Notifications