ఆంధ్రజ్యోతి, టీవీ9 నిలిపివేత: టిని రిపోర్ట్ అడిగిన కేంద్రం
న్యూఢిల్లీ: తెలంగాణ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసానాలను మూడు రోజులుగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా స్పందించింది.
కేంద్ర సమాచార ప్రచారశాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయమై బుధవారం ఆరా తీశారు. రెండు చానెళ్ల ప్రసారాలు ఎందుకు నిలిపివేశారు? జరిగిన వాస్తవమేమిటి? నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

కేబుల్ ఆపరేటర్లు, కేబుల్ వ్యవస్థ కేంద్రం పరిధిలోనిదని, కేబుల్ చట్టాలను ఎలా ఉల్లంఘిస్తారని తెలంగాణ సీఎస్‌ను ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారట. కేబుల్ ఆపరేటర్లు చట్టాన్ని ఉల్లంఘించినట్లు రుజువు అయితే వాళ్లపై చర్యలు తప్పవని, కాబట్టి వాస్తవ పరిస్థితిని నివేదిక రూపంలో అందజేయాలని జవదేకర్ ఆదేశించారు.
రెండు, మూడు రోజులుగా ఎంఎస్‌వోలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి , టీవీ-9 ప్రసారాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రసారాల నిలిపివేతపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళన కూడా చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications