తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ, ఇదే...

 'Jaya Jaya He Telangana' to be the new state song
హైదరాబాద్: డాక్టర్ అందెశ్రీ రచించిన 'జయ జయహే తెలంగాణ' గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికయింది. తెలంగాణ స్కూళ్లలో ఉదయ గీతంలా ఇప్పటికే ప్రసిద్ధమైంది. జూన్ రెండు నుంచి తెలంగాణ ప్రభుత్వ అధికారిక గేయంగా కానుంది. తెలంగాణ చరిత్ర, వర్తమానాలను బొమ్మగట్టి.. భవిష్యత్తుపై అంతులేని ఆశ్వాసాన్ని ప్రకటించిన ఈ గీతం 11 చరణాలతో రూపొందింది.

ఇందులోని నాలుగు చరణాలను ఎంచుకొని రాష్ట్ర గీతంగా పాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యవేక్షణలోనే ఈ గీతానికి తుది మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. మారిన పరిస్థితుల్లో ఆయన కొన్ని సవరణలను చేశారు.

అందెశ్రీ రాసిన నాటికి తెలంగాణ పది జిల్లాలతో ఉంది. అయితే ఆ సంఖ్యను 24 జిల్లాలకు పెంచాలని కెసిఆర్ భావిస్తున్నారు. దానికి అనుగుణంగా గేయంలో మార్పు చేశారని తెలుస్తోంది. ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ గీతంతోనే సంబురాలు ప్రారంభం కానున్నాయి.

అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తి గ్రామానికి చెందిన వారు. జయ జయహే తెలంగాణ గీతం రానున్న తెలంగాణ ప్రభుత్వంలో పాఠ్య పుస్తకాలలో ముందు పేజీల్లో ఉండనుంది. ఇప్పటి వరకు మా తెలుగు తల్లి గేయం ఉంది. ఆ స్థానంలో జయ జయహే తెలంగాణ రానుంది.

తెలంగాణ రాష్ట్ర గీతం ఇదే..

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

జానపద జన జీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+