పెద్దిరెడ్డి అండతో 3 వేల ఎకరాలు కబ్జా, మొత్తం లాగుతామని అంటున్న రెడ్డి, ఎక్కడంటే?
బ్రిటీష్ పాలన తలపించేలా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అరాచకపాలన కొనసాగిందని, ఇప్పుడు రాక్షసపాలన అంతం అయ్యిందని తంబళపల్లె నియోజక వర్గం టీడీపీ నాయకుడు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జయచంద్రా రెడ్డి మండిపడ్డారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు సాగించిన అరాచకపాలనతో అన్యాయం జరిగిన ప్రజలు అందరికి న్యాయం చేస్తామని జయచంద్రా రెడ్డి హామీ ఇచ్చారు.
తంబళపల్లె నియోజక వర్గంలోని బి. కొత్తట బస్టాండ్ సర్కిల్ లో టీడీపీ నాయకులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకుడు జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తంబళపల్లెలో వైసీపీ నాయకులు కబ్జాలు చేసిన మూడు వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని ఆ భూములను సొంత హక్కుదారులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని, చంద్రబాబుతో మాట్లాడి ఆపని చేస్తానని, భూమి హక్కుదారులు ధైర్యంగా ఉండాలని జయచంద్రా రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాల కొనసాగిన బ్రిటీష్ పాలన అంతం అయ్యిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తి లభించిందని జయచంద్రా రెడ్డి అన్నారు. తంబళపల్లెలోని ఓటర్లను బెదిరించిన పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఆయనకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం వలనే ఆయన గెలిచారని, లేదంటే తాను కచ్చితంగా విజయం సాధించేవాడని జయచంద్రా రెడ్డి ఆరోపించారు.
తంబళపల్లెలో మనం ఓడిపోయినా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉందని, మూడు పార్టీల కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తాను అందరికి అందుబాటులో ఉంటానని, ఎలాంటి కష్టం వచ్చినా చంద్రబాబుతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని జయచంద్రా రెడ్డి టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. తంబళపల్లెలో పెద్దిరెడ్డి అండచూసుకుని కబ్జా చేసిన వేల ఎకరాల భూములు మళ్లీ స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అప్పగిస్తామని జయచంద్రా రెడ్డి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications