సిఎం పదవి ఆశించి మచ్చ: ఆనం బ్రదర్స్‌పై సోదరుడి ఫైర్

 Jayakumar fires at Anam brothers
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని ఆశించి గత మూడు రోజులుగా సేవ్ ఆంధ్ర ప్రదేశ్, సేవ్ కాంగ్రెసు పార్టీ అంటూ కుటుంబానికే మచ్చతెచ్చావని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పైన ఆయన సోదరుడు, మాజీ కార్పోరేటర్ ఆనం జయకుమార్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. దశాబ్దాలుగా పెద్దలు సంపాదించిన పేరు ప్రతిష్ఠలను దిగజార్చి ఇప్పుడు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ, వివేకానంద రెడ్డిలు సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పటంతో ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ముఖ్యమంత్రి కావాలనే పదవీ కాంక్షతో విభజనకు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీ నిర్ణయాలకు వత్తాసు పలికితే తమ తండ్రి ఆత్మక్షోభిస్తుందన్నారు. ఎన్నుకున్న ప్రజలకు వారు న్యాయం చేయాలన్నారు.

రాయపాటి రాజీనామా

కేబినెట్ తెలంగాణ నోట్ ఆమోదాన్ని నిరసిస్తూ తాను ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు చెప్పారు. విభజన నిర్ణయాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. కొందరి మాటలు విని అధిష్టానం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చాలా మూర్ఖంగా నిర్ణయం తీసుకుందన్నారు. పది సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు.

ఆకాంక్ష నెరవేరింది: మోత్కుపల్లి

తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని టిడిపి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. బిల్లును వెంటనే పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ఇరు ప్రాంతాల జెఏసి నేతలను పిలిచి మాట్లాడితే తప్పేంటన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+