అనాటి బంధం: జయసుధ కోసం జయప్రద ప్రచారం!

హైదరాబాద్: సికింద్రాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధకు మద్దతుగా తన సహచర నటి, ఆరెల్డి నేత జయప్రద ప్రచారం నిర్వహించనున్నారు. వీరిద్దరూ సమకాలీన నాయికలు కావడంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందువల్లనే పార్టీలు వేరైనప్పటికీ జయసుధకు కోసం ప్రచారం చేసేందుకు జయప్రద సిద్ధమైంది.

కాగా, ఇప్పటికే సికింద్రాబాద్ నియోజకవర్గంలో జయసుధ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాడవాడలా, ఇంటింటికి వెళ్లి తననే మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. ప్రచారంలో ఎక్కువ మంది మహిళలు పాల్గొని జయసుధకు మద్దతు తెలుపుతున్నారు. తమ అభిమాన నటి ఇంటికి రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Jayaprada to campaign for Jayasudha

సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇతర పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూన వెంటేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పద్మారావులు కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆదం విజయ్ కుమార్ కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జయసుధకు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురుకానుంది. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా జయసుధ, విజయశాంతిలు ప్రచారం చేయనున్నాని మాజీ మంత్రి, టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఇటీవల పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+