రెండున్నర గంటల సినిమా కాదు: రజనీకాంత్, కమల్ హాసన్‌లకు జయప్రద హెచ్చరిక
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్‌ల రాజకీయరంగ ఆరంగేట్రంపై ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద స్పందించారు. రజనీ, కమల్‌లు రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
అయితే వారు వెళ్లే దారి పూలదారి మాత్రం కాదని, ఎన్నో ముళ్లు, రాళ్లు ఉంటాయని చెప్పారు. వాటిని చూసి అడుగు వేయాలన్నారు. రాజకీయాలంటే కేవలం రెండున్నర గంటల సినిమా మాత్రం కాదన్నారు.

సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. జయలలిత మృతి తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని చెప్పారు. రజనీ, కమల్ హాసన్‌లు రాణిస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. తన రాజకీయ పునరాగమనం ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications