కూల్చుతాననడం టిపై ప్రేమనా: కెసిఆర్‌పై జెపి నిప్పులు
హైదరాబాద్: మెట్రో ప్రాజెక్టు కూల్చుతానని హెచ్చరించడం తెలంగాణపై ప్రేమనా? అని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడ్డారు. లోక్‌సత్తా పార్టీ ఏడో మహాసభ సికింద్రాబాదులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సమ్మెలు, బందులు అంటే బలవంతపు వసూళ్లు కాదన్నారు. ప్రభుత్వ విధానాలు తప్పుగా ఉంటే మార్చేందుకు ఉపయోగపడాలన్నారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. తమ పోరాటం వల్లనే ఆహార ధాన్యాల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలను తొలగించిందన్నారు. పంటకు తగిన ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.

రచ్చబండలో మంత్రి ఆనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పాలనలో అన్ని రంగాల్లో పేద ప్రజలను అభివృద్ధి చేశారని, నాలుగున్నరేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజల అభివృద్ధికే అన్నారు.
కాగా, ఆనం రాపూరులో కొత్తగా మంజూరైన కేంద్ర సహకార బ్యాంకును, స్ర్తీశక్తి భవనాన్ని ప్రారంభించారు. రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ, ఎంపి చింతామోహన్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications