రాజమౌళి సూపర్: బాహుబలికి జేపీ ప్రశంసలు, టాలీవుడ్ జక్కన్న థ్యాంక్స్
బాహుబలి చిత్రంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లోక్‌సత్తా అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్ వేదికగా యూనిట్ సభ్యులను ప్రశంసించారు.
హైదరాబాద్: బాహుబలి చిత్రంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లోక్‌సత్తా అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్ వేదికగా యూనిట్ సభ్యులను ప్రశంసించారు.
బాహుబలి 2 అద్భుతమైన భావోద్వేగాలు, విజువల్స్‌తో కూడుకున్నదన్నారు. రాజమౌళి భారత చిత్ర పరిశ్రమను ప్రపంచ పటంలో ఉంచారని జయప్రకాశ్ నారాయణ కితాబిచ్చారు.

కీరవాణి సంగీతం స్ఫూర్తిదాయకమని, రమ, వల్లి, ఇతర యూనిట్ సభ్యులు ఏళ్ల తరబడి కష్టపడి మాస్టర్ పీస్‌ను ప్రొడ్యూస్ చేశారన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. జేపీకి ధన్యవాదాలు చెప్పారు.
masterpiece* misspelt https://t.co/uz1iL4RWVs
— Jayaprakash Narayan (@JP_LOKSATTA) May 4, 2017












Click it and Unblock the Notifications