తెలంగాణ ఎమ్మెల్సీల సమావేశంలో జెసి ఇలా (ఫొటోలు)

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీల సమావేశంలో రాయలసీమకు చెందిన కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి దర్శనమిచ్చారు. తాజా పరిస్థితులను సమీక్షించుకోవడానికి కాంగ్రెసుకు చెందిన తెలంగాణ ఎమ్మెల్సీలు గురువారం శాసనసభ ఆవరణలోని కాంగ్రెసు శానససభ పక్షం (సిఎల్పీ) కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఆరు వారాల్లోగా కేంద్ర మంత్రుల బృందం తెలంగాణపై నివేదిక ఇవ్వకపోతే తమ ప్రాంత ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రుల బృందానికి ఓ నివేదిక సమర్పించాలని వారు నిర్ణయించారు.

కేంద్ర మంత్రుల బృందానికి చెప్పాల్సిన అంశాలపై ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లు సమావేశానంతరం ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భాను ప్రసాదరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తెలంగాణపై తమను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్ కోరారు.

తెలంగాణ ఎమ్మెల్సీల సమావేశంలో జెసి

తెలంగాణ ఎమ్మెల్సీల సమావేశంలో జెసి

కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించాల్సిన నివేదికపై చర్చించడానికి సమావేశమైన తెలంగాణ ఎమ్మెల్సీల మధ్యకు రాయలసీమకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వచ్చారు. గతంలో కూడా తెలంగాణ మంత్రుల సమావేశంలోకి ఆయన ఇలాగే వచ్చారు.

ఆమోస్‌తో మాట్లాడుతూ..

ఆమోస్‌తో మాట్లాడుతూ..

తెలంగాణ ఎమ్మెల్సీల సమావేశంలో జెసి దివాకర్ రెడ్డి తనదైన శైలిలో ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్‌తో మాట్లాడుతూ కనిపించారు. వారి మధ్య ఏ విధమైన సంభాషణ జరిగిందనేది బయటివారికి ఆసక్తి కలిగించింది.

ప్రత్యేక పిసిసికి విజ్ఞప్తి

ప్రత్యేక పిసిసికి విజ్ఞప్తి

తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక పిసిసి ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భాను ప్రసాదరావు కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు సత్వరమే పిసిసిని ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ మంత్రులకు విజ్ఞప్తి

తెలంగాణ మంత్రులకు విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించిన కార్యక్రమాల్లో తెలంగాణ మంత్రులను ఎమ్మెల్సీలను కలుపుకోవాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్ కోరారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రెండు చోట్ల శాసనమండళ్లు కొనసాగుతాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+