'జేసీ ఊరకుక్క, అప్పుడు పరిటాల కాళ్లు పట్టుకున్నారు': వైసిపి హెచ్చరిక

అనంతపురంలో ఉండేందుకు జేసీ సోదరులు గతంలో మాజీ మంత్రి, టిడిపి నేత పరిటాల రవి కాళ్లు పట్టుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి ఆదివారం విమర్శించారు.

అనంతపురం: అనంతపురంలో ఉండేందుకు జేసీ సోదరులు గతంలో మాజీ మంత్రి, టిడిపి నేత పరిటాల రవి కాళ్లు పట్టుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి ఆదివారం విమర్శించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ఊర కుక్క అని, గతంలో పరిటాల దెబ్బకు జేసీ సోదరులు పరారయ్యారని వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జేసీ సోదరుల్ని అడ్డు పెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే జగన్‌ను నేరుగా ఎదుర్కోవాలన్నారు.

దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత జేసీ సోదరులు - వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. శనివారం జేసీ ప్రభాకర్ రెడ్డి.. జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించారు. ఈ నేపథ్యంలో వైసిపి నేతలు కొయ్య ప్రసాద్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు ఆదివారం కౌంటర్ ఇచ్చారు.

JC brothers touched Paritala's legs: YSRCP

బాబు అండతో రెచ్చిపోతున్న జేసీ

జగన్ పైన జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు సరికాదని వైసిపి ఆదివారం నాడు మండిపడింది. విజయవాడ, అనంతపురం, విశాఖ, నెల్లూరు తదితర జిల్లాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వైసిపి నిరసన చేపట్టింది.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. జేసీ నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జేసీ వీధి రౌడీనా లేక ఎమ్మెల్యేనా అని వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి నిలదీశారు.

ఆయన భాష చూసి ఎమ్మెల్యేలు తల దించుకుంటున్నారన్నారు. ప్రభాకర్ రెడ్డిని సోషల్ మీడియాలో అందరూ తిడుతున్నారన్నారు. ఆయనన చంద్రబాబు సమర్థిస్తారా, చర్యలు తీసుకుంటారా చెప్పాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+