ఎన్టీఆర్‌కే చెల్లింది: పవన్‌పై జెసి, జాగ్రత్త: ఫ్యాన్స్ హెచ్చరిక

ఇప్పడు సినిమా గ్లామర్‌ను చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు మరే హీరో అలా ఓట్లు రాబట్టుకోలేకపోయారన్నారు. పవన్ ఉద్వేగభరితంగా ఉన్నారని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షలు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన హామీల పైన ఎలాంటి స్పష్టత లేదన్నారు.
సంతకాలు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. చంద్రబాబు పైన ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు. చంద్రబాబు చెప్పిన రుణమాఫీని అన్ని వర్గాల వారు నమ్ముతున్నారని, మహిళలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ చచ్చిపోయిందన్నారు. కాంగ్రెసు నిర్వహిస్తున్న బస్సుయాత్ర ఆ పార్టీకి శవయాత్రనే అన్నారు. కాంగ్రెసు పార్టీకి మాస్క్ పెట్టి బతికి ఉందని నమ్మిస్తున్నారని ఎద్దేవా చేశారు.
షబ్బీర్ అలీకి హెచ్చరిక
పవన్ కళ్యాణ్ పైన తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై పవన్ అభిమానులు నిప్పులు చెరిగారు. ఏదైనా మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తిరుపతిలో శుక్రవారం పవన్ ఫ్యాన్స్ మీడియా సమావేశంలో ఈ హెచ్చరికలు జారీ చేశారు. మీ ఇంటి కొస్తాం చూసుకుందామా?, లేక నీవే మా ఊరు వస్తావా? అని సవాల్ విసిరారు. నోరు మూసుకోకపోతే నీ బాగోతమంతా యూట్యూబ్‌లో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెడతామని హెచ్చరించారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications