జగన్ వల్లే.. ఆ రోజే చెప్పా, మహాత్ముడా..: చంద్రబాబుపై జేసీ సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పైన ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిలిస్తే జనం రావడానికి చంద్రబాబు జాతిపిత మహాత్మా గాంధీ ఏమాత్రం కాదన్నారు. పయ్యావుల కేశవ్ వంటి నాయకులకే టిడిపిలో గుర్తింపు లేకుంటే ఎలాగని ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఆందోళనతోనే తాను అప్పుడు టిడిపిలో చేరానని చెప్పారు. వైసిపి అధికారంలోకి వస్తే మంచిది కాదని తాను టిడిపిలో చేరుతున్నట్లు ఆనాడే చంద్రబాబుకు చెప్పానన్నారు.
చంద్రబాబు అధికారులతో పరిపాలన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారుల రాజ్యం వద్దని తాను చంద్రబాబుకు పలుమార్లు చెప్పానని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కాగా, జేసీ గతంలోను పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications