నోరు జారుతున్నారు..: జగన్‌ను జేసీ దివాకర్ రెడ్డి అంత మాట అనేశారు!

తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోమవారం నాడు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోమవారం నాడు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వాడు తిక్క ముండా కొడుకు కాకుంటే.. అని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

జగన్‌కు తిట్టడం తప్ప మరొకటి తెలియదన్నారు. ప్రజల ఓట్లు కావాలనుకునే వారు పట్టిసీమను వ్యతిరేకిస్తారా అని నిలదీశారు. ప్రజలందరూ పోలవరం కావాలని అనుకుంటే జగన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో చెప్పాలన్నారు. అయితే, తిక్క ముండా కొడుకు వ్యాఖ్యలపై వైసిపి నేతలు భగ్గుమన్నారు.

జగన్‌పై తీవ్ర వ్యాఖ్య

జగన్‌పై తీవ్ర వ్యాఖ్య

జగన్‌ను ఉద్దేశించి 'వాడు' అని పదే పదే ఉపయోగిస్తుంటారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి తనకు దగ్గర అని, జగన్‌ను తాను చిన్నప్పటి నుంచి చూశానని, ఆ చనువుతో తాను జగన్‌ను 'వాడు' అంటుంటానని జేసీ వివరణ ఇస్తుంటారు.

అదే దారిలో పలువురు నేతలు..

అదే దారిలో పలువురు నేతలు..

అయితే, కర్నూలు జిల్లాలో జగన్ పైన చేసిన తిక్క ముండా కొడుకు వ్యాఖ్యలు మాత్రం చర్చనీయంగా మారాయి. నేతల మాటలు హద్దులు మీరుతున్నాయనే వాదనలు చాలా కాలంగా ఉంది. రోజా, బోండా ఉమ వంటి నాయకులు కూడా గతంలో ఇలాగే మాట్లాడారని అంటున్నారు.

అసెంబ్లీ సమావేశాల సమయంలో..

అసెంబ్లీ సమావేశాల సమయంలో..

గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రోజా సభలోనే అనుచితంగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆమె పైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇది చర్చనీయంగా మారింది.

అధినేతలపై..

అధినేతలపై..

వైసిపి అధినేత వైయస్ జగన్ పైన బోండా ఉమ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కొడాలి నాని వంటి నేతలు కూడా పరుషపదాలు వాడుతుంటారని, నేతల మాటలు హద్దులు దాటుతున్నాయని అంటున్నారు. కాగా, రెండు రోజుల క్రితం జేసీ చేసిన తీవ్ర వ్యాఖ్యల పైన వైసిపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+