శాంతిభద్రతలు అదుపుతప్పాయి! ఆ ఎమ్మెల్యే కారణంగానే.: బాబుకు చిట్టా అంటూ జేసీ, మీడియాపైనా..
అనంతపురం: ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితోపాటు ప్రభుత్వ అధికారులు, పోలీసులపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసు పేరుతో నేరస్తులకు దండం పెట్టి ఎదుట కూర్చోబెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

అక్రమాలు జరుగుతున్నా..
బుధవారం జేసీ దివాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనంతపురం నగరంలో ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నా పట్టించుకునే అధికారి లేడంటూ తీవ్రంగా ఆరోపించారు. జిల్లా కలెక్టర్, జేసీలకు తాను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.

శాంతి భద్రతలు అదుపు తప్పాయి..
అనంతపురం జిల్లాలో పోలీసు వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వీర్యమైపోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని జేసీ ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి జేసీ ధ్వజమెత్తారు.

ప్రభాకర్ చౌదరి కారణంగానే.. సీఎంకు చిట్టా
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కారణంగా తాను అనంతపురంలో ప్లాస్టిక్ వాడకం నిరోధించలేకపోయానని, రోడ్లు విస్తరించలేకపోయానని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని అధికారుల చిట్టాను ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంచుతానని చెప్పారు.

మీడియాను విచిపెట్టలేదు..
ఆ తర్వాత మీడియాపైనా జేసీ విమర్శలు చేశారు. అనంతపురంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా మీడియా ప్రతినిధులు కళ్లు మూసుకుంటున్నారని కూర్చున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications