చంద్రబాబు ప్రధాని కావొచ్చు, మోడీ తీరు బాగాలేదు, జగన్ పార్టీ ఖాళీ: జేసీ

చిత్తూరు: అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు సంచలన, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుప్పించిన ఆయన, చంద్రబాబు పైన ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ మిత్రపక్షాలను కరివేపాకులా చూస్తున్నారని మండిపడ్డారు. ముందు ముందు జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆయన స్పందించారు. వైసిపి డ్యాంకు పడిన చిల్లు ఇప్పట్లో ఆగదని చెప్పారు. ఆ పార్టీ మొత్తం ఖాళీ అయ్యేదాకా పడిన గండి పూడ్చుకోదని ఎద్దేవా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు జగన్‌ పార్టీలో నేతలెవరూ ఉండరని జోస్యం చెప్పారు. ఆ పార్టీ రంధ్రం పడిన జలాశయంలా తయారైందని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని కూడా కావొచ్చునని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రధాని అయినా ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. భవిష్యత్తులో బిజెపి, కాంగ్రెస్, వామపక్షాల చేతుల్లో జాతీయ రాజకీయాలు ఉండవని చెప్పారు.

JC Diwakar Reddy interesting comments on Chandrababu, YS Jagan and Modi

లోకేష్ పైన యనమల

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రి పదవి వస్తే ఆయన కోసం తమ పదవులను త్యాగం చేస్తామని పలువురు టిడిపి ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంపై గురువారం చంద్రబాబు కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నారా లోకేశ్ మంత్రి అవుతారా? సీఎం అవుతారా? అన్న విషయం ఇప్పుడు అప్రస్తుతమే కాక అప్రాధాన్యమని కూడా వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా యనమల ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు తర్వాత నారా లోకేశ్ సీఎం అవుతారా? అయితే ఇంతవరకు పార్టీలో నెంబర్ 2గా ఉన్న మీ పరిస్థితి ఏమిటి అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి యనమల కాస్తంత ఇబ్బందిగానే స్పందించారు. లోకేశ్ మంత్రి కావడం, ముఖ్యమంత్రి కావడమనేది అప్రస్తుత, అప్రాధాన్య అంశమన్నారు.

ముఖ్యమంత్రి పదవికేముంది.. లోకేశ్ కావచ్చు, బొడ్డు వెంకటరమణ (స్థానిక మీడియా ప్రతినిధి) కావొచ్చన్నారు. మీడియా ప్రశ్నలతో కాస్త ఇబ్బంది పడ్డ యనమల.. ఉపయోగపడే ప్రశ్నలు వేయండంటూ ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+