అమెరికా ఈ మెయిల్ ఇష్యూ: జగన్‌కు జేసీ దివాకర్ రెడ్డి సూచన
అమెరికా ఈ మెయిల్స్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు.
అనంతపురం: అమెరికా ఈ మెయిల్స్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉండగా ఆయనకు చెడ్డపేరు వచ్చేలా కొందరు వ్యక్తులు తప్పుడు మెయిల్స్ పంపించడం సరికాదన్నారు.
మన వాళ్లు అమెరికా వెళ్లినప్పుడు మనం సహకరించాలని హితబోధ చేశారు. ఇలాంటి మెయిల్స్ ఎవరు పంపించినా తప్పేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో టిడిపి నేతలు జగన్‌నే తప్పుబడుతున్నందున... జేసీ వ్యాఖ్యలు పరోక్షంగా ఆయనకే వర్తిస్తాయి.

కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమెరికా పర్యటనలో ఈమెయిల్స్ వ్యవహారం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టిడిపి - వైసిపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.












Click it and Unblock the Notifications