కోడి పందాలపై జేసీ దివాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు, రంగంపేటలో జల్లికట్టు
ఎప్పుడూ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేసే జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం కోళ్ల పందాల పైన ఇంటరెస్టింగ్ కామెంట్లు చేశారు. కోడి పందేల గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
ఏలూరు: ఎప్పుడూ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేసే తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం కోళ్ల పందాల పైన ఇంటరెస్టింగ్ కామెంట్లు చేశారు. కోడి పందేల గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పోలవరం పనులు త్వరగా పూర్తి కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అలాగే నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని చెప్పారు. గోదావరి జిల్లావాసులు మంచి మనసుతో ఉంటారని ప్రశంసించారు.

రంగంపేటలో జల్లికట్టు
చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు (పశువుల పండగ} ఉత్సాహంగా కొనసాగుతోంది. కనుమ పండుగ సందర్భంగా రంగంపేటలో ఏటా ఈ పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తమిళనాడులోని జల్లికట్టుతో దీనికి పోలిక లేదని అంటారు.
తాము పశువులను హింసించబోమని గ్రామస్థులు చెబుతున్నారు. పశువులను వీధుల్లోకి వదులుతుండగా గ్రామస్థులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పండగ తిలకించేందుకు సమీప గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.












Click it and Unblock the Notifications