బాబు అమరావతిలో, పాలన హైదరాబాద్ నుంచి.. స్తబ్దత: జెసి
అనంతపురం: ప్రభుత్వ పాలనపై తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాలనలో స్తబ్దత ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో కూర్చుని ఉండడం, పాలన మాత్రం హైదరాబాద్ నుంచి కొనసాగుతుండడం స్తబ్దతకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మరో ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల నుంచి తీవ్రమైన ఆసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం రాజకీయ నిరుద్యోగులే రాయలసీమపై మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సంచలన వ్యాఖ్యలు, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జెసి దివాకర్ రెడ్డికి అలవాటే.












Click it and Unblock the Notifications