ఎదగనివ్వలేదు: కాంగ్రెస్, వైయస్‌పై జెసి హాట్ కామెంట్స్

మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండన్న రీతిలో అధిష్టానం వ్యవహరిస్తోందన్నారు. విభజనపై కటువుగా మాట్లాడుతోందన్నారు. సీమాంధ్రలో రాజకీయ శూన్యత ఉందని, కొత్త పార్టీ వస్తే... ఎవరు పెడతారో, ఎలాంటి వారు వస్తారో చూడాలని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దల మాటలు సీమాంధ్ర ప్రజలను మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు. సీమాంధ్ర ప్రజలను చల్లార్చే ప్రకటనలు మాని బాంబుల్లాంటి మాటలేమిటని ప్రశ్నించారు.
ఢిల్లీ పెద్దలు బాంబుల్లాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాయల తెలంగాణ గురించి ఢిల్లీ పెద్దలకు ఏమీ అర్థం కావడం లేదన్నారు. హైదరాబాదుకు ఐటి ప్రాజెక్టు ఇవ్వడమంటే అగ్నికి ఆజ్యం పోయడమే అన్నారు. విభజించి మంచి ప్యాకేజీ ఇస్తారనుకుంటే అగ్గి రాజేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ పెద్దల తప్పిదం తమ దురదృష్టకరమని, దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దలు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియడం లేదన్నారు. తాము కాంగ్రెసు పార్టీని వదిలి పెట్టడం తప్ప మరో మార్గం లేదన్నారు.
వైయస్ పైన ఆగ్రహం
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో మరో నాయకుడిని ఎదగకుండా అణగదొక్కారని నిప్పులు చెరిగారు. మరో నేతను ఎదగకుండా చేసిన ఖ్యాతిని ఆయన దక్కించుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది మా దురదృష్టమన్నారు. ఈ పరిస్థితి మాకు ఎప్పుడో అర్థమైందని, జ్ఞానోదయమయిందన్నారు.












Click it and Unblock the Notifications