ఇక అప్పులెవరిస్తారు, కొత్తదేం కాదు: 'కాల్ మనీ'పై జెసి ఆసక్తికర వ్యాఖ్య
అనంతపురం: వడ్డీ వ్యాపారుల పైన చర్యలు తీసుకుంటే ప్రజలకు అప్పులు ఇచ్చేది ఎవరని జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు. కాల్ మనీ వ్యవహారం ఈ రోజుది కాదని, ఎప్పటి నుంచే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల మద్దతుదారులు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని చెప్పారు.
ఇటీవల పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జెసి ప్రతి విషయంలోను కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు.

వైసిపి కార్యకర్తలు, బంధువుల ఆందోళన
కడప జిల్లాలో శుక్రవారం నాడు పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బెంగళూరులో మృతి చెందిన వైసిపి కార్యకర్తల మృతదేహాలతో వారు తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
నలుగురి మృతికి కారణమైన వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications