హడలెత్తించిన జేసీ: మీకే తెలియకపోతే పిల్లలకు ఏం నేర్పుతారని ఫైర్!
అంగన్ వాడీ కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా.. గోడల మీద ఉన్న కార్టూన్లను చూపిస్తూ.. అవేంటని? అక్కడి కార్యర్తలను అడిగారు.
తాడిపత్రి: జేసీ బ్రదర్స్ ఇద్దరూ ఇద్దరే. ఎక్కడికెళ్లినా అదే హడావుడి, అవే వ్యంగ్యాస్త్రాలు. చిర్రెత్తుకొస్తే ఎదుటి వ్యక్తి ఎంతటోడైనా లెక్క చేయరు. తాజాగా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి గ్రామంలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జేసీ .. అక్కడి అంగన్ వాడీ కార్యకర్తలను హడలెత్తించారు.
అంగన్ వాడీ కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా.. గోడల మీద ఉన్న కార్టూన్లను చూపిస్తూ.. అవేంటని? అక్కడి కార్యర్తలను అడిగారు. తెలియదని వారు బదులివ్వడంతో.. 'మీకే రాకపోతే పిల్లలకు ఏం నేర్పుతారు?' అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్న చిన్న పదాలు కూడా తెలియకపోతే.. కార్యకర్తలుగా ఉద్యోగం చేయడానికి మీరు అనర్హులంటూ జేసీ వారిపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆగ్రహంతో సీడీపీవో స్పందించారు. త్వరలోనే కార్యకర్తలకు స్వయంగా పరీక్షలు నిర్వహించి.. అందులోంచి అనర్హులను తొలగిస్తామని అన్నారు. జేసీ వెళ్లిపోయాక సీడీపీవో అంగన్ వాడీ కార్యకర్తలను మందలించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications