అజ్ఞాతంలోకి వెళ్లిన జెసి!: చంద్రబాబుకు ఆర్ కృష్ణయ్య హెచ్చరిక
అనంతపురం/హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఆయనకు వివాదం ఏర్పడిందని, అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే వాదనలు వినిపిస్తున్నాయి.
తన అనుచరులకు పెయిడ్ గన్‌మెన్‌లను కేటాయించడంపై జెసి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసనగా తన వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గన్‌మెన్‌లను ఆయన వెనక్కి పంపించారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా పట్టించుకోలేదు. గన్‌మెన్‌లు లేకపోవడంతో జెసి ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది.

కాపులను బీసీల్లో చేరిస్తే..: ఆర్ కృష్ణయ్య హెచ్చరిక
కాపులను బీసీల్లో చేరుస్తామంటే రావణకాష్టాన్ని రగిల్చినట్లేనని బీసీ సంఘం నేత, టిడిపి తెలంగాణ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య బుధవారం హెచ్చరించారు. కాపులు ఒక్కసారి సమావేశం పెట్టగానే భయపడుతున్నారని, ఇక తమకు అన్యాయం జరుగుతుందని తెలిస్తే, బడుగులు వేసే అడుగులు ఎలా ఉంటాయో తాను ఊహించలేనన్నారు.
కాపుల్లోనూ పేదలున్నారని, ఒక్క కాపుల్లోనే కాదు.. బ్రాహ్మణుల్లో అంతకన్నా పేదలున్నారన్నారు. రెడ్లలో సహా ఇతర కులాల్లో పేదలున్నారని చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించినా సహకరిస్తామని, అంతే తప్ప బీసీ కులాల్లో కాపులను చేర్చాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమన్నారు.
కాపు కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు ఇస్తామంటున్నారని, దానిని రూ.2 వేల కోట్లకు పెంచాలని మేం డిమాండ్ చేస్తున్నామని, పేదరికాన్ని పారద్రోలే చర్యలు చేపట్టాలే తప్ప రిజర్వేషన్లు అని పేరెత్తితే సహించే ప్రశ్నేలేదన్నారు. బీసీలకు అన్యాయం జరుగకుండా, కాపులను బీసీల్లో చేరుస్తామని అనడం చంద్రబాబుకు తగదని, ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications