రాయలేని విధంగా..: సాక్షి పత్రికను దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికపై ఆయన నిప్పులు చెరిగారు.
అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికపై ఆయన నిప్పులు చెరిగారు.
రాయడానికి వీలులేని పదజాలాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సాక్షి పత్రికలో తమకు వ్యతిరేకంగా వార్తలు రావడంపై ఆయన తీవ్రంగా దూషించారు.

ఆ పత్రిక అందుకు కూడా పనికిరాదంటూ రాయలేని భాషలో వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు తీవ్రస్థాయిలో పరుష పదజాలంలో మాట్లాడారు. అంతేకాకుండా చాలామంది కమీషన్లు తీసుకుని పనులు చేసి పెడతారన్నారు.












Click it and Unblock the Notifications