నా అరెస్ట్‌తో న్యాయం జరిగితే, వల్లకాదు.. అమ్మేస్తా: జెసి

తాను అరెస్టయినంత మాత్రాన న్యాయం జరగదని, బాధితులకు చెల్లించే నష్టపరిహారం కోసం అందరితో తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. ప్రయివేటు బస్సులతో ట్రావెల్స్ నిర్వహించడం తన వల్ల కాదని వచ్చే ఏడాది మార్చిలోగా తనకు ఉన్న బస్సులన్నింటినీ అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
కాగా, అక్టోబర్ 30వ తేదిన జరిగిన మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాద బాధితులు శుక్రవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఆరని మంటలు పేరుతో శుక్రవారం దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన బస్సు యజమాని జెసి ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశాయి.
ఈ ధర్నాలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా పాల్గొని బాధితులకు అండగా నిలబడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో జాతీయ రహదారి పైన జరిగిన వోల్వో బస్సు ప్రమాదం ఘటనలో 45 మంది మృత్యువాత పడ్డారు.












Click it and Unblock the Notifications