పెద్దారెడ్డి పాపాలు పండిపోయాయి, తాడిపత్రిలో తన్ని తాటతీస్తా, జేసీ వార్నింగ్

నా మీత తప్పుడు కేసులు పెట్టి వేధించిన పోలీసు అదికారులు, వైసీపీ నాయకులు ఎవ్వరినీ వదిలిపెట్టనని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. తన మీద తప్పుడు కేసులు పెట్టించి ఊర్లో తప్పుడు పనులు చేస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా వదిలిపెట్టనని, అందరి కథ త్వరలో తేలుస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

తన మీద తప్పుడు కేసులు పెట్టారని తన దగ్గర సాక్షాలు కూడా ఉన్నాయని, ఆ సాక్షాలు పోలీసులకు చూపిస్తుంటే తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆ రోజు జగన్ సీఎంగా ఉన్నాడని, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడని వాళ్లు చెప్పినట్లు విని తన మీద తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులే ఇప్పుడు భేషరత్తుగా తన మీద నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

JC Prabhakar Reddy who warned former MLA Ketireddy Peddareddy not to leave

వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓ దుర్మార్గుడు అని, మునిసిపల్ ఉద్యోగులకు తాను ఇండ్లు కట్టించి ఇస్తే వాటిని అతని భార్య పేరు మీద రాయించుకున్నాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సోలార్ కంపెనీ యజమానులను బెదిరించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి చివరికి అతని కొడుకు, కోడలు పేరుతో ఆ సోలార్ కంపెనీని రాయించుకున్నారని, తాడిపత్రిలో సుమారు ఆరు సెంట్ల భూమిలో అక్రమంగా ఇంటిని నిర్మించుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

తాడిపత్రిలో అక్రమంగా నిర్మించిన పెద్దారెడ్డి ఇంటిని త్వరలో పడగొడుతామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. తాడిపత్రిలో గత ఐదు ఏళ్లు పాటు అక్రమాంగా సామాన్యలు భూములు, మామిడి తోటలు లాక్కొని ఆరాచకాలు చేసిన పెద్దారెడ్డి పాపం పండిపోయిందని, అతని అరాచకాలు అన్నీ కళ్ల ముందు కనపడుతుంటే ఆయనతో పాటు ఆయన కుమారులను ఎందుకు జిల్లా నుంచి బహిష్కరించలేదో చెప్పాలని జేసీ ప్రబాకర్ రెడ్డి పోలీసు అధికారులను నిలదీశారు.

తన కొడుకు అస్మిత్ రెడ్డికి చాలా ఏళ్ల నుంచి గన్ లైసెన్స్ ఉందని, ఆ గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం 2020 మే 13వ తేదీన అప్పటి వైసీపీ ప్రభుత్వానికి అర్జి సమర్పిస్తే ఇంత వరకు ఇవ్వలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు పెద్దారెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నా ఆయన్ను మాత్రం పోలీసులు వదిలేశారని, తమ మీద తప్పుడు కేసులు పెట్టి వేధించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెద్దారెడ్డిని పోలీ్సులు వదిలేసినా మేము మాత్రం వదిలిపెట్టమని, అతని అరాచకాలకు త్వరలోనే బ్రేకులు వేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+