అనంతపురం కాదు: రాజధానిపై జెసి, గల్లా ఇలా

JC says Ananthapur will not be capital
అనంతపురం/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అనంతపురంలో ఏర్పాటు కాదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడి ఆశీస్సులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఆయన శనివారం మీడియాతో అన్నారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఆయన చెప్పారు. జిల్లా పర్యాటకాభివృద్ధికి కేంద్రం నుంచి 11 కోట్ల రూపాయల నిధులు మంజురైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర రాజధాని నగరంపై శివరామకృష్ణన్ కమిటీతో రాష్ట్ర మంత్రి నారాయణ తదితరులు సమావేశమైన నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి ఆ ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం జరగలేదని గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ హైదరాబాదులో మీడియాతో చెప్పారు. రాజధాని ఏర్పాటుకు బడ్జెట్ కూడా ఖరారు కాలేదని చెప్పారు. సచివాలయంలో ఏపి రాజధాని కమిటీ సమావేశం ముగిసిన తర్వాత గల్లా జయదేవ్ మాట్లాడారు.

రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, మలేషియాలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన ఎపి రాజధాని కమిటీ సమావేశంలో తొమ్మిది కమిటీ సభ్యులు, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు మెకంజీ, ఎల్అండటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు . రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం అందిస్తుందని గల్లా జయదేవ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+