మళ్లీ టిడిపి ఎందుకు గెలుస్తుందో చెప్పిన జేసీ, బెజవాడలో ఏ ఆఫీస్ ఎక్కడ?
అనంతపురం: నవ్యాంధ్ర ప్రదేశ్‌లో రెండోసారి కూడా అధికారం తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం నాడు జోస్యం చెప్పారు. ఆయన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో రైతు రుణ ఉపశమన పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. 2019 ఎన్నికల్లో మరోసారి టిడిపియే గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇందుకు గల కారణాలు కూడా ఆయన చెప్పారు.
విభజన అనంతరం ఏపీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, వాటిని అధిగమిస్తూ చంద్రబాబు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం తపిస్తున్నారన్నారు. ఆయనను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. అలాంటి ప్రజల ఆశీస్సులతోనే టిడిపి రెండోసారి అధికారంలోకి వస్తారని, బాబు మళ్లీ సీఎం అవుతారన్నారు.

నవ్యాంధ్రలో కార్యాలయాలు.. ఉద్యోగులతో సందడి
హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివస్తున్న శాఖల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం విజయవాడ, గుంటూరు పరిసరాల్లో మొత్తం పదమూడు కార్యాలయాలు ప్రారంభమవుతున్నాయి.
విజయవాడ నక్కల రోడ్డులోని పాత చరితశ్రీ ఆసుపత్రి భవనంలో పంచాయితీ రాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని, మారుతీ నగర్‌లోని జీపీఆర్ వీధిలో ఉన్న వీ ప్లాజాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్‌ను, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న జెడ్పీ ఆఫీస్‌లో పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభిస్తున్నారు.
ప్రసాదంపాడులో అద్దె భవనంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, ఏపీ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీ, డెరైక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయాలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభిస్తున్నారు.
గొల్లపూడిలో ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని అయ్యన్నపాత్రుడు, అక్కడే సెర్ప్ ఆఫీసును కిమిడి మృణాళిని, శాప్ కార్యాలయాన్ని చైర్మన్ మోహన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మంత్రి గంటా శ్రీనివాస రావు, బస్ భవన్‌ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ప్రారంభిస్తున్నారు.
విజయవాడ గురునానక్ కాలనీ రోడ్డులో ఏపీఐఐసీ ఆఫీస్
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఐటీ కార్యాలయం
పెనమలూరులో మత్స్యశాఖ కార్యాలయం
గొల్లపూడిలో చీఫ్ ఇంజినీర్ సీఈడీడీవో ఆఫీస్
రామలింగేశ్వర రోడ్డు, ఆటో నగర్‌లో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ ఆఫీస్
డోర్నకల్ రోడ్డులో కాపు కార్పోరేషన్ ఆఫీస్
ట్రెండ్ సెట్ మాల్ పక్క వీధి, బెంజ్ సర్కిల్లో బీసీ కమిషన్ ఆఫీసు
నారా చంద్రబాబు నాయుడు కానీ, బెంజి సర్కిల్లో రాష్ట్ర ప్రణాళీకా సంఘం కార్యాలయం
మ్యూజియం రోడ్డులో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆఫీస్
కరెన్సీ నగర్లో ఇంటర్ విద్యా ఆఫీస్
పాత ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్
పాత ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఏపీ పారా మెడికల్ బోర్డు
ఆంధ్రా ఆసుపత్రి పక్కన గొల్లపూడిలో పరిశ్రమల శాఖ.












Click it and Unblock the Notifications