అందు కోసం అనంతపురంలో జేసీ సోదరులు వర్సెస్ మంత్రి పల్లె
అనంతపురం: తెలుగుదేశం పార్టీలో కొత్తకాపులు పాత కాపులకు మద్య పొరపొచ్చలు ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతున్నాయి. తాజాగా, అనంతపురం జిల్లాలో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో వ్యవసాయ కాలేజ విషయమై వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో కొత్తగా నాలుగు వ్యవసాయ కాలేజీలు, పది పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అంగీకరించింది. తాజాగా ప్రకటించిన నాలుగు కాలేజీలు తక్కిన వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఓ కాలేజీ కోసం మంత్రి పల్లెతో పాటు జేసీ సోదరులు తీవ్రంగా పోటీ పడుతున్నారని తెలుస్తోంది.

వ్యవసాయ కాలేజీ కోసం భూమిని సేకరించాల్సి ఉంటుంది. కాలేజీ ఏర్పాటు కోసం మంత్రి పల్లె ఉత్సాహంగా ఉన్నారు. ఇందుకోసం ఆయన ఆలమూరు సమీపంలోని 117 ఎకరాలను కొనుగోలు చేశారని, దీనిని గత నెల 25న బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని అంటున్నారు.
మరోవైపు, పెద్దపప్పూరు మండలం జూటూరు, తిమ్మనచెరువు ప్రాంతంలో జేసీ సోదరులకు లేదా ఆయన వర్గీయులకు 200 నుంచి 300 ఎకరాల వరకు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కాలేజీ కోసం ఇటు మంత్రి పల్లె, అటు జేసీ సోదరులు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications