టీడీపీలోకి జీవిత, రాజశేఖర్?: ఆ వ్యాఖ్యలకు అర్థం అదేనా!..

జీవిత వ్యాఖ్యలతో టీడీపీలోకి ఆమె ఎంట్రీపై చర్చ మొదలైంది.

విజయవాడ: ఒక్క హిట్టు జీవిత రాజశేఖర్‌లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపింది. కెరీర్‌పై మళ్లీ నమ్మకం కలిగేలా చేసింది. ఇన్నాళ్లు కాస్త ఢీలా పడ్డట్టు కనిపించిన జీవిత, రాజశేఖర్‌లు ఇప్పుడు రాజకీయంగాను మళ్లీ యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల ఓ కార్యక్రమంలో జీవిత చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. సీఎం చంద్రబాబుపై కార్యక్రమంలో ఆమె ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మీరు టీడీపీలో చేరుతున్నారా? అంటూ ఓ జర్నలిస్టు జీవితను ప్రశ్నించారు. బదులుగా 'చేరమంటే.. చేరుతాను' అని జీవిత వ్యాఖ్యానించారు.

jeevitha rajasekhar may joins tdp in soon

జీవిత వ్యాఖ్యలతో టీడీపీలోకి ఆమె ఎంట్రీపై చర్చ మొదలైంది. అటు టీడీపీ కూడా జీవిత రాక పట్ల సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, అప్పట్లో జీవిత, రాజశేఖర్ ఇద్దరూ టీడీపీకి అనుకూలంగానే ఉండేవారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరినప్పటికీ.. అందులోను ఎక్కువ రోజులు నిలవలేదు. ఆపై బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. జీవితకు సెన్సార్ బోర్డు పదవి దక్కడం జరిగిపోయాయి. తాజా 'గరుడ వేగ' హిట్టుతో జీవిత రాజశేఖర్‌లో రాజకీయాలపై మళ్లీ ఉత్సాహం మొదలైనట్టు కనిపిస్తోంది. చూడాలి మరి టీడీపీలో జీవిత చేరిక ఊహాగానాలకే పరిమితమవుతుందో లేక నిజంగానే జరుగుతుందో!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+