జిగ్నేష్‌ని అడ్డుకున్న పోలీసులు: ఎమ్మెల్యే, పోలీస్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం

అహ్మదాబాద్: ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని పోలీసులు అడ్డుకున్నారు. గత శుక్రవారం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న భాను వంకార్ కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు జిగ్నేష్‌ను అడ్డుకున్నారు.

భాను వాంకర్ బలిదానానికి సంతాపంగా సారంగపూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సంస్మరణ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వాంకర్ కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇందులో పాల్గొనేందుకు జిగ్నేష్ అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు.

Jignesh Mevani, others detained ahead of Ahmedabad rally

అయితే, పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రారంభంలోనే పోలీసులు అతనిని కారులో నుంచి బయటకు తీసుకొచ్చి, వెంట తీసుకు పోయారు.

ఈ మేరకు సేష్లా రషీద్ ట్విట్టర్‌లో సందేశాలను, వీడియోను పోస్ట్ చేశారు. పోలీసులు జిగ్నేష్‌ను ఎత్తుకెళ్లారని, ఎమ్మెల్యేతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. జిగ్నేష్ మేవానీ, పోలీసు అధికారులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. కారు దిగాలని వారు ఎంత చెప్పినా అతను వినలేదు. దీంతో అతనిని బలవంతంగా దించారని కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+