బీజేపీది రాద్దాంతం.. అదీ ఎప్పుడో కట్టింది: సుచరిత

గుంటూరులో జిన్నా టవర్ ఫోటో రాజకీయ దుమారం రేపింది. పోస్టు చేయడం.. ప్రతిపక్షాల విమర్శలతో హీటెక్కింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. స్వాతంత్య్రానికి ముందే నిర్మించిన చరిత్రాత్మకమైన కట్టడం అని చెబుతోంది. గుంటూరులో గల జిన్నాటవర్‌ గురించి బీజేపీ నేతలు ఇప్పుడు రాద్ధాంతం చేయటం సరికాదని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

జిన్నాటవర్‌పై ఇప్పుడు ఏదో ఆశించి కామెంట్ చేయటం మంచి పద్ధతి కాదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, అన్ని కులాలు, మతాల వారు కలిసి మెలిసి సోదరభావంతో మెలుగుతున్నారని చెప్పారు. స్వాతంత్రానికి పూర్వం ఎంతో మంది మన దేశాన్ని పాలించారని, అప్పటి పరిస్థితులు, త్యాగాలను బట్టి అనేక నిర్మాణాలు జరిగాయని సుచరిత తెలిపారు.

 jinnah tower build before independence

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో కాంట్రవర్సీకి బీజం పడింది. ఏపీ బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు మద్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతున్న సమయంలోనే ఇప్పుడు మరో కాంట్రవర్సీకి బీజేపీ జాతీయ స్థాయి నేత సత్యకుమార్ ఆజ్యం పోశారు. ఆయన గుంటూరు జిన్నా టవర్‌పై చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు పట్టణంలో ఉన్న జిన్నా టవర్‌ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన బీజేపీ నేత సత్య కుమార్‌.. 'ఈ టవర్‌కు జిన్నా పేరు మీద నామకరణం చేశారు. అంతేకాకుండా ఈ ఏరియాను జిన్నా సెంటర్‌గా పిలుస్తారు. ఇది ఉంది పాకిస్థాన్‌లో కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో. దేశ ద్రోహి అయిన అలీజిన్నా పేరును ఇంకా టవర్‌కు కొనసాగిస్తున్నారు. ఈ టవర్‌కు భరత మాత ముద్దు బిడ్డ అయిన అబ్దుల్‌ కలాం పేరో, దళిత రచయిత గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టరు.? ఒక సూచనగా చెబుతున్నాను' అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. అదీ అగ్గిరాజేసింది.

సత్య కుమార్‌ చేసిన ట్వీట్‌కు బిజేపీ నేతల నుంచి రియాక్షన్స్‌ మొదలయ్యాయి. తెలంగాణ బీజేపీ నాయకుడు, గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే జిన్నా సెంటర్‌ పేరు మార్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యకర్తలు జిన్నా టవర్‌ను కూలగొట్టండి అంటూ కామెంట్‌ చేశారు. వెంటనే ఆ పేరును తొలిగించి స్వతంత్ర్య యోధుల పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+