జియో వాడేవారికి శుభవార్త.. కొత్త ప్లాన్ వచ్చింది

టెలికాం మార్కెట్‌పై బలమైన బ్రాండ్ వేసిన జియో.. జియో ఫైబర్ (Jio fiber) ద్వారా బ్రాండ్‌బ్యాండ్‌ సర్వీసుల విషయంలోనూ అంతే దూకుడుగా వెళుతోంది. అత్యంత చౌకధరలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ బ్రాడ్ బ్యాండ్ పథకాలను తీసుకొస్తోంది. జియో ఫైబర్‌ యూజర్ల కోసం మూడు నెలల ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను కొత్తగా తీసుకొచ్చింది. రూ.1197గా ధర నిర్ణయించారు.

ఇంటర్నెట్‌ ఒక్కటే కావాలనుకునేవారికి ఈ మూడు నెలల ప్లాన్‌ సరిపోతుంది. 30 ఎంబీపీఎస్‌ వేగంతో 90 రోజులు ఇంటర్నెట్‌ లభిస్తుంది. ప్రతినెలా అపరిమిత డేటా (3.3 TBవరకు)తో పాటు కాలింగ్‌ సదుపాయం ఇచ్చారు. ఓటీటీ బెన్‌ఫిట్స్‌ మాత్రం లభించవు. ప్లాన్‌ మొత్తానికి జీఎస్టీ అదనం.

jio

రూ.399 నుంచి జియో ఫైబర్‌లో ప్లాన్లు ప్రారంభమవుతున్నాయి. బేసిక్‌ ప్లాన్లలో ఏయే సదుపాయాలు లభిస్తున్నాయో మూడు నెలల ప్లాన్‌లోనూ అవే ఉన్నాయి. ప్రతినెలా రీఛార్జి చేసుకునే బదులు ఒకేసారి రీఛార్జి చేసుకునే వారికి ఈ ప్లాన్‌ బాగా ఉపయోగపడుతుంది. టీవీ ఛానెళ్లు, ఓటీటీ వంటివి కావాలనుకునే వారు ఎక్కువ మొత్తం చెల్లించి ఇతర ప్లాన్లు తీసుకోవాలి. రూ.1197ప్లాన్‌ మాదిరిగానే రూ.699 ప్లాన్‌ (100 ఎంబీపీఎస్‌) ను మూడు నెలలకు రూ.2097కి; రూ.999 (100 ఎంబీపీఎస్‌) రూ.2997కి; రూ.1499 ప్లాన్‌ను (300 ఎంబీపీఎస్‌ )రూ.4497కు.. ఇలా మరికొన్ని ప్రీపెయిడ్‌ పథకాలను మూడునెలల ప్లాన్ల రూపంలో జియో అందిస్తోంది.

జియోలో నెలకు రూ.999కి (జీఎస్ టీ అదనం) 150 ఎంబీపీఎస్ వేగంతో ఇస్తున్న ప్లాన్ ప్రజాదరణ పొందింది. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. వాయిస్ ఉచితంగా ఇస్తోంది. 150 ఎంబీపీఎస్ వేగంతో డౌన్ లోడ్, అంతే వేగంతో అప్ లోడ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+